/rtv/media/media_files/2025/10/26/71-maoists-surrender-to-police-in-chattisgarh-2025-10-26-19-51-57.jpg)
Maoists Surrender to Police
Maoist Partys Ceasefire: తెలంగాణ మావోయిస్టు పార్టీ చేసిన కాల్పులు విరమణ ప్రకటన ఊహించని పరిణామమని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు తూర్పు ప్రాంతీయ బ్యూరో ప్రతినిధి సింగల్ పేరుతో గురువారం ఓ లేఖ విడుదలైంది..తెలంగాణ మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రభుత్వంతో ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుందని ఆ లేఖలో తీవ్ర ఆరోపణలు చేసింది.
తెలంగాణ మావోయిస్టు పార్టీ ఎలాంటి నోటీసులు లేకుండా, అధికారికంగా ప్రకటించకుండా, తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయిందని, కనీసం అక్కడి పరిణామాల గురించి తమకు చెప్పకపోవడం బాధాకరమని తెలిపారు. సీఆర్‌బీ ప్రాంతంలో (ఛత్తీ్‌స్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్) జరగుతున్న సాయుధ, నిరాయుధ లొంగుబాట్లు, ఒప్పందాలను ఈఆర్‌బీ ఖండిస్తోందన్నారు. అవి పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయని, విప్లవ ఉద్యమంలో ఒడుదుడుకులు సహజమని, వాటిని దాటుకుంటూ తమ పార్టీ ఈ దశకు చేరుకుందని సింగల్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే సాయుధ పోరాటం కొనసాగుతుందని కమిటీ స్పష్టం చేసింది.
ఇది కూడా చూడండి: Bus Accident: చేవెళ్ల ఘటన మరవకముందే తెలంగాణలో మరో ఆర్టీసీ ప్రమాదం.. డివైడర్ ఎక్కడంతో స్పాట్‌లో..!
Follow Us