Megastar Chiranjeevi : చిరంజీవి ఇంటికి చేరిన టాలీవుడ్ పంచాయితీ
వేతనాలు పెంచాలంటూ టాలీవుడ్ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. నిర్మాతలు కార్మికుల యూనియన్లతో చర్చలు జరిపినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదు. అటు యూనియన్ లీడర్లు, ఇటు నిర్మాతలు ఎవరూ తగ్గడం లేదు. దీంతో సమస్య చిరంజీవి ఇంటికి చేరింది.