Indigo: 550 విమానాలు రద్దు..మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. నిన్న ఒక్కరోజే 550 విమానాలను రద్దు చేశారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలుస్తోంది.

New Update
indigo

నిర్వహణ లోపాల కారణంగా గత రెండు రోజులుగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దవుతున్నాయి. నిన్న కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దాదాపుగా 550 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేశామని ఇండిగో తెలిపింది. ఒక్క హైదరాబాద్‌లోనే 79 విమానాలు రద్దయ్యాయి. దిల్లీలో 172, ముంబయిలో 118, బెంగళూరులో 100, కోల్‌కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 రద్దయ్యాయి. దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో పాటూ చాలా ఫ్లైట్లు ఆలస్యంగా నడిచాయి. ప్రతీ మూడింటిలో రెండు ఆలస్యంగా నడిచాయి.

Also Read :  హైదరాబాద్ హౌస్‌లో పుతిన్‌కు ఆతిథ్యం.. అది ఎవరిదో తెలుసా?

శంషాబాద్ లో గందరగోళం..

మరోవైపు విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు సరైన సమయంలో చెప్పడం లేదు. దీంతో వందల మంది విమానాశ్రయాలకు చేరుకున్నారు. చెక్‌-ఇన్‌ పూర్తయి లోపలికి వెళ్లాక మీరు వెళ్లాల్సిన విమానం రద్దయిందంటూ చెప్పడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో ఇండిగో సిబ్బందిపై దాడి కూడా చేశారు. శంషాబాద్ లో మొదట 20 విమానాలు మాత్రమే రద్దయ్యాయని చెప్పారు. తీరా ఎయిర్ పోర్ట్ కు వచ్చాక మరో 39 విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వేల మంది తీవ్ర నిరాశకు గురైయ్యారు. మరోవైపు ఫ్లైట్ల ఆలస్యం వల్ల సుమారు 3వేల మంది ప్రయాణికులు గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 4గంటల వరకూ ఎదురుచూశారు. హైదరాబాద్‌ నుంచి కొచ్చిన్‌కు వెళ్లాల్సిన విమానం గురువారం కూడా రద్దవడంతో శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు విమానాశ్రయంలో నిరసన చేపట్టారు.

Also Read :  డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు.. బంపర్ ఆఫర్‌ ప్రకటించిన కంపెనీ

ఫిబ్రవరి 10 వరకు ఇంతే..

ఇండిగో విమాన(Indigo Flight) సర్వీసుల పరిస్థితి మరో రెండు రోజులు ఇలానే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిని చక్కదిద్దేందుకు పౌరవిమానయానశాఖ కూడా రంగంలోకి దిగింది. అయితే అది అంత సులభం కాదని ఇండిగోసీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరికి 10కిగానీ ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 8 నుంచి విమానాల సంఖ్య తగ్గిస్తామని తెలిపారు. ఇండిగో విమానాల గందరగోళంపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అతి త్వరగా విమానాలను సాధారణ స్థితికి చేర్చాలని, ఛార్జీలను పెంచవద్దని సూచించారు. 

Advertisment
తాజా కథనాలు