కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధరలు.. HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం కోకాపేటలోని నియోపోలిస్‌లో వేలంపాట నిర్వహించింది. ఈసారి HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం వచ్చింది.

New Update
Kokapet Lands Auction

Kokapet Lands Auction

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం కోకాపేటలోని నియోపోలిస్‌లో వేలంపాట నిర్వహించింది. ఈసారి HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం వచ్చింది. నియోపోలిస్ స్థలాలకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వివిధ వ్యాపార సంస్థలు వేలంలో పోటీపడి మరీ భూములను సొంతం చేసుకుంటున్నాయి. అయితే శుక్రవారం నిర్వహించిన ఈవేలంలో 1.98 ఎకరాల గోల్డెన్ మైల్‌ స్థలాన్ని  COEUS ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకంగా రూ.77.75 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు నాలుగు విడుతలుగా వేలం పాట జరిగింది. దీంతో HMDA ఆదాయం గతేడాది కన్నా 87 శాతం వృద్ధి సాధించింది.  

Also Read: శనివారం 1000లోపే విమాన సర్వీసులు రద్దు.. ఇండిగో సీఈవో కీలక ప్రకటన

ఇటీవల జరిగిన మూడో విడత వేలం ప్రక్రియలో ప్లాట్‌ నెంబర్ 19, 20లో ఉన్న 8.04 ఎకరాలకు అధికారులు వేలం నిర్వహించారు. నెంబర్ 19లో ఉన్న ఎకరానికి రూ.131 కోట్లు, నెంబర్ 20లోని ఎకరానికి రూ.118 కోట్ల ధరలకు అమ్ముడుపోయాయి. మూడో విడుతలో జరిగిన 8.04 ఎకరాలకు HMDAకు రూ.వెయ్యి కోట్ల లాభం వచ్చింది. 

Also Read: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !

Advertisment
తాజా కథనాలు