IBomma Ravi: ఐ బొమ్మ రవి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఐ బొమ్మ రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు అతనిపై ఐటీ, చట్టం, సినిమా పైరసీ లాంటి వాటితో పాటూ ఫారినర్స్ యాక్ట్ కూడా జోడించారు.

New Update
Ibomma Ravi

Ibomma Ravi

తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ టాలీవుడ్(tollywood-news-in-telugu) కు తీవ్ర నష్టం కలిగించిన ఐ బొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు రవి(iBomma Ravi) ఇప్పటికే పోలీసుల ఖైదులో ఉన్నాడు.  బుధవారం అతడిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా బషీర్‌బాగ్‌లోని సైబర్‌క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌కు అతడిని తరలించారు. పైరసీ వెబ్‌సైట్లకు సంబంధించి అన్ని కోణాల్లో అధికారులు రవిని ప్రశ్నిస్తున్నారు. నాంపల్లి కోర్టు మొత్తం అయిదురోజుల పాటు రవిని విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 

Also Read:  ప్రైవేటు వ్యక్తుల లబ్ధి కోసమే  ‘ఫార్ములా- ఈ’ కుట్ర..ఏసీబీ సంచలన ఆరోపణ

మరో కేసు నమోదు..

రవిపై ఇప్పటి వరకు ఐటీ, చట్టం, సినిమా పైరసీ, మోసం ద్వారా నష్టం, అనుమతి లేకుండా ప్రైవేటు చిత్రాలను దొంగిలించి ప్రసారం, గోప్యతకు భంగం మొదలైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు వాటికి మరో కొత్త యాక్ట్ ను యాడ్ చేశారు పోలీసులు. రవి ప్రస్తుతం కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశస్థుడు కావడంతో అతనిపై ఫారిన్ యాక్ట్ నేరాన్ని కూడా నమోదు చేశారు. విదాేశీయులు మన దేశంలో నేరాలకు పాల్పడితే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. రికార్డుల ప్రకారం భారత పౌరుడు కాకపోవడంతో పోలీసులు ఫారినర్స్‌ యాక్ట్‌లోని సెక్షన్లను జోడించారు. రవిని విచారించిన పోలీసులు ఇప్పటికే బ్యాంకు లావాదేవీల గురించి సమాధానాలు రాబట్టారు. ఎన్‌ఆర్‌ఐ ఖాతాలు, క్రిప్టో వ్యాలెట్లకు నగదు మళ్లింపు గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇంకో నాలుగు రోజులు సైబర్‌క్రైమ్‌ పోలీసులు  అతన్ని విచారిస్తారని తెలుస్తోంది. 

ఇదిలాఉండగా ఇమ్మడి రవి దాదాపు 21 వేల సినిమాలను పైరసీ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. గత ఆరేళ్లుగా అతడు కరేబియన్ దీవుల్లో ఉంటూ 66 మిర్రర్‌ వెబ్‌సైట్లలో పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు దాదాపు 50 లక్షల మంది డేటా సేకరించి సైబర్ నేరగాళ్లు, గేమింగ్, బెట్టింగ్‌ యాప్‌ల నిర్వాహకులకు అమ్మేసి వందల కోట్లలో డబ్బులు సంపాదించినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడిపై కస్టడీ కొనసాగుతోంది. ఇది పూర్తయిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం బయటికి రానుంది. 

Also Read :  తెలంగాణ బాక్సర్ నిఖత్ ఖాతాలో మరో స్వర్ణం

Advertisment
తాజా కథనాలు