Nikhat Zareen: తెలంగాణ బాక్సర్ నిఖత్ ఖాతాలో మరో స్వర్ణం

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి అదరగొట్టింది. ప్రపంచ కప్ బాక్సింగ్ ఫైనల్స్ లో గెలిచి స్వర్ణాన్ని దక్కించుకుంది. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్‌ 5-0తో గవో యీ గ్జువాన్‌ ని చిత్తు చేసింది.

New Update
nikhat

Nikhat Zareen (in Blue)

బాక్సర్ నిఖత్ జరీన్(nikhat-zareen) మరోసారి దుమ్ముదులిపింది. తన పామ్ ను నిరూపించుకుంటూ స్వర్ణంతో మెరిసింది. ప్రపంచకప్ బాక్సింగ్(boxing) ఫైనల్లో నిన్న మమిళల 51 కేజీల విభాగంలో నిఖత్ 5-0తో చైనీస్ తైపీ అమ్మాయి గవో యీ గ్జువాన్ ను ఓడించింది. తొలి రౌండ్‌ నుంచే ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసిన నిఖత్‌.. పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది. ఆఖరిదాకా అదే జోరు కొనసాగించి తేలిగ్గా విజయాన్ని సొంతం చేసుకుంది. టీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌లోనే ఓడిన ఈ తెలంగాణ అమ్మాయి నిఖత్ మళ్ళీ తనను తాను నిరూపించుకుంది.  

Also Read :  ప్రియుడితో స్మృతి మంధాన ఎంగేజ్‌మెంట్ కంప్లీట్ - వీడియో చూశారా

భారత్ కు ఎనిమిది స్వర్ణాలు..

నిఖత్ కు వచ్చిన స్వర్ణంతో ప్రపంచ కప్ బాక్సింగ్ లో బారత్ ఖాతాలో ఎనిమిది పసిడి పతకాలు చేరాయి. 57 కేజీల్లో పారిస్‌ కాంస్య పతక విజేత చైనీస్ తైపీ  వుయీను జైస్మిన్‌ లాంబోరియా 57 కేజీల విభాగంలో కంగుతినిపించగా.. 60 కేజీల్లో  జాప్ అమ్మాయి తగుచి అయాకాను పర్వీన్‌ హుడా చిత్తు చేసింది. 80 కేజీల్లో ఉజ్బెకిస్తాన్ కు చెందిన  సొటిమ్‌బొయెవాను నుపుర్‌ షెరోన్‌ ఓడించింది. అలాగే 70 కేజీల్లో  అదే ఉజ్బెకిస్తాన్ చెందిన అజీజాపై అరుంధతి చౌదరి పైచేయి సాధించింది. 54 కేజీల్లో ఇటలీకు చెందిన సిరిన్‌ పై ప్రీతి పన్వర్‌.. 48 కేజీల్లో ఫోజిలివా పై మీనాక్షి హుడా గెలిచి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. పురుషుల 70 కేజీల తుదిపోరులో  కజకిస్తాన్ కు చెందిన నార్‌బెక్‌ పై హితేశ్‌ గులియా.. 60 కేజీల్లో మునార్‌బెక్‌ పై సచిన్‌ సివాచ్‌ గెలిచి స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. ఇక రజతాల విషయానికి వస్తే.. 50 కేజీల విభాగంలో జాదుమణి సింగ్‌ , 80 కేజీల దాంట్లో అంకుశ్‌, 55 కేజీల విభాంగలో పవన్‌ , 65 కేజీల విభాగంలో అబినాష్‌ , 80 కేజీల విభాగంలో పూజ రాణి  ఫైనల్లో ఓడి రజతాలను దక్కించుకున్నారు.  అసిల్‌బెక్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో జాదుమణి, సమందర్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో పవన్‌ ఓడారు. నిషియెమా (జపాన్‌)కు అబినాష్‌.. ఒలాడ్‌మిజ్‌ (ఇంగ్లాండ్‌)కు అంకుశ్‌ లొంగిపోయారు. అగటా (పోలెండ్‌) చేతిలో అరుంధతి ఓడగా..మొత్తంగా 20 పతకాలు (9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) గెలిచిన భారత్‌ అగ్రస్థానంతో టోర్నీని ముగించింది.

సీఎం రేవంత్ అభినందనలు..

ప్రపంచ కప్ బాక్సింగ్ లో పత్తా చాటిన నిఖత్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.  నిఖత్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. నిఖత్ జరీన్ అద్భుతమైన ప్రతిభను కనబరిచి ప్రపంచ వేదికపై దేశకీర్తిని చాటారు. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో నిఖత్ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నానని రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read: IBomma Ravi: ఐ బొమ్మ రవి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

Advertisment
తాజా కథనాలు