/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Sankranti-holidays-jpg.webp)
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. తెలంగాణలో మేడారం తర్వాత జరిగే రెండో అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు లేదా గొల్లగట్టు) జాతర సందర్భంగా నేడు సెలవు ఇచ్చారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తూ జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈరోజు ఈ రెండు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రేపటి నుంచి యథావిధిగా విద్యాసంస్థలు పని చేస్తాయని అధికారులు ప్రకటించారు.సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో రెండేళ్లకొకసారి పెద్దగట్టు జాతర నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు సాగే జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. జాతరలో తొలి అంకమైన దేవర పెట్టెకు తొలుత సూర్యాపేట గ్రామీణ మండలం కేసారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దగట్టు జాతర...
అనంతరం ఈ పెట్టెను మేళతాళాలు మోగిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో యాదవ కులస్థులు, హక్కుదార్లు, పూజారులు శోభాయాత్ర నిర్వహించి పెద్దగట్టు ఆలయానికి చేర్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా.. కర్ణాటక, తమిళనాడుల నుంచి పెద్దఎత్తున భక్తులు తమ మొక్కులు సమర్పించేందుకు గట్టుకు చేరుకుంటారు. ఈ క్రమంలో 'ఓ లింగా.. ఓ లింగా..' అంటూ దైవనామస్మరణతో పెద్దగట్టు జాతర ప్రాంగణం అంతా మారు మోగింది.
నేటి ఉదయం నుంచి లింగమంతుల స్వామికి బోనాలు సమర్పించడం, జాగిలాలు పోయడం, ముద్దెరపోలు వంటి క్రతువులు నిర్వహించనున్నారు. లింగమంతుల జాతర ప్రారంభం కావడంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై పోలీసులు ట్రాఫిక్చే ఆంక్షలు విధించారు. వాహనాలను వేరే రూట్లో దారి మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వెహికల్స్ కోదాడ నుంచి హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద నేషనల్ హైవే మీదకు వెళ్లేలా పోలీసులు చేస్తున్నారు..
కోదాడ హుజూర్‌నగర్ ప్లైఓవర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లిస్తుండటంతో హైవేపై రద్దీ ఏర్పడి కోదాడలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వెహికల్స్‌ను నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద డైవర్ట్ చేస్తున్నారు. వాహనాల మళ్లింపుతో అదనంగా 20 కి.మీ. ప్రయాణించాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kumbh Mela: మరో తొమ్మిదే రోజులే ఉన్నా..ఏ మాత్రం తగ్గని జనం...రైల్వేశాఖ అలర్ట్!