/rtv/media/media_files/2025/10/04/hyderabad-fire-accident-2025-10-04-13-46-19.jpg)
Hyderabad Fire Accident
సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లోతకుంట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లోతకుంట ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఒక సైకిల్ దుకాణంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వేగంగా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో మొత్తం ఆరు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఆరు దుకాణాలు దగ్ధం..
హైదరాబాద్ నగరంలోని అల్వాల్ పరిధిలో అగ్నిప్రమాదం.
— Tupaki (@tupaki_official) October 4, 2025
ఒక సైకిల్ షాపులో ప్రారంభమయ్యి, పక్కనే ఉన్న 8 షాపులకు విస్తరించిన మంటలు.
ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.#Hyderabad#HyderabadNews#FireAccident#TeluguNews#Tupakipic.twitter.com/AUC6ymmP32
ఈ అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి.. వారం రోజులకే దూలానికి ఉరేసుకుని యువతి సూసైడ్!
ప్రాథమిక విచారణలో అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణమై ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గురైన దుకాణాల యజమానులు జరిగిన నష్టాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తదుపరి విచారణలో ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి బ్లూ డ్రమ్ములో కుక్కిన ప్రియుడు.. ఎందుకంటే?