Telangana News: గుండెపోటుతో లండన్‌లో తెలంగాణ యువకుడి మృతి

తెలంగాణకు చెందిన యువకుడు లండన్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్‌ రెడ్డి అనే యువకుడు  అక్టోబర్ 3న శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించినట్లు అతని స్నేహితులు ఫోన్‌ చేసి తల్లిదండ్రులకు చెప్పారు.

New Update
Telangana youth dies of heart attack in London

Telangana youth dies of heart attack in London

తెలంగాణకు చెందిన యువకుడు లండన్‌(london) లో గుండెపోటు(heart-attack) తో మృతి చెందాడు. జగిత్యాల(jagityala) జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్‌ రెడ్డి (26) అనే యువకుడు  అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించినట్లు అతని స్నేహితులు ఫోన్‌ చేసి తల్లిదండ్రులకు చెప్పారు. మహేందర్‌రెడ్డి రెండు సంవత్సరాల క్రితం పీజీ చేసేందుకు లండన్ వెళ్లాడు. కాగా ఇటీవలే పీజీ పూర్తి చేసిన ఆయనకు వర్క్ వీసా కూడా వచ్చింది. మహేందర్ తండ్రి ఏనుగు రమేశ్‌ రెడ్డి మేడిపల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తు్న్నారు.  

Also Read :  హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం!

Telangana Youth Dies Of Heart Attack In London

వర్క్‌ వీసా కూడా రావడంతో తమ కొడుకు సెటిల్‌ అయిపోయాడని తల్లిదండ్రులు సంతోషపడుతున్న సమయంలో విషాద వార్త వినాల్సి రావడంతో మృతుని కుటుంబం కన్నీటి పర్యంతమైంది. తమ కొడుకు ప్రయోజకుడు అయ్యాడని సంతోషించేలోపే ఆయన మరణవార్త వినాల్సి రావడంతోమహేందర్‌ రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా మహేందర్‌ రెడ్డి తండ్రి రమేశ్‌ రెడ్డి తన కుమారుడి మృత దేహాన్ని దేశానికి తీసుకురావడానికి లండన్ బయలు దేరి వెళ్లినట్లు తెలిసింది. మహేందర్‌ మృతి పట్ల ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, ఇతర నాయకులు సంతాపం తెలిపారు.

ఇది కూడా చూడండి: Amazon, Flipkart sale: ఐఫోన్లు 'Out of stock' కాకుండా ఉండటానికి 5 సింపుల్ ట్రిక్స్!

Advertisment
తాజా కథనాలు