/rtv/media/media_files/2025/08/08/hyderabad-rain-alert-2025-08-08-15-39-18.jpg)
Hyderabad rain alert
Rain Alert: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోభారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ క్రమంలోనే మరికాసేపట్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని GHMC తెలిపింది. రాబోయే 2 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరంలోని కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, గాజులరామారం, అల్వాల్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 20mm వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చిరించింది.
ఇది కూడా చూడండి:Shrishti Fertility Center: సృష్టి కేసులో ఈడీ రంగ ప్రవేశం.. భారీగా నిధులు తరలింపుపై అనుమానాలు
తెలంగాణ వ్యాప్తంగా కొన్ని గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలను సైతం జారీ చేసింది.
ఇది కూడా చూడండి:Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్
ఇక, శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం పూర్తిగా తడిచి ముద్దయింది. నగరం అంతా వరద నీటిలో మునిగిపోయింది. అయితే, మలక్‌పేట్ బ్రిడ్జి వద్ద బురద పెరుకుపోయింది. భారీ వర్షానికి అన్ని ప్రాంతాల్లో ఆరడుగుల మేర నీరు నిలిచింది. సుమారు రెండు గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చాదర్‌ఘాట్, మలక్‌పేట్ మీదుగా దిల్‌సుఖ్‌నగర్, సంతోష్ నగర్ ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. అలాగే, హైదర్‌గూడలో ఓ అపార్ట్మెంట్ సెల్లార్ నీటి మునిగింది. సెల్లార్ నుంచి నీటిని తొలగించడానికి అధికారులు శ్రమిస్తున్నారు. అపార్ట్ మెంట్లో ఉన్న పలువురిని కాపాడారు.
ఇది కూడా చూడండి: IAF: ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలు కూల్చేశాం.. IAF చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ఈ రోజు సాయంత్రం కూడా నగరంలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. రైతులు, వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రానున్న కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని, అవసరం లేకున్నా రోడ్లమీదకు రావొద్దని వాతావరణ శాఖ తెలిపింది.