Rain Alert: ముంచుకొస్తున్న వాయుగుండం.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!
పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఈరోజు ఉదయం ఒడిశా- ఉత్తర కోస్తా సమీపంలోని గోపాల్ పూర్ వద్ద తీరం దాటింది. వాయుగుండం ప్రభావం వల్ల ఈరోజు కూడా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.