Cloud Burst For Hyderabad : హైదరాబాద్కు క్లౌడ్ బరస్ట్ హెచ్చరిక...ఎవరూ బయటకు రావొద్దని సూచన
హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్లకు పైగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.