Rain Alert: నీటమునిగిన హైదరాబాద్...చిగురుటాకులా వణికిన నగరం
ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిపోయింది. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన కుండపోత వర్షం పడుతుండటంతో నగరమంతా అస్థవ్యస్తంగా మారింది. ఎటు చూసిన మోకాళ్లలోతులో నీళ్లు నిలిచిన రోడ్లే దర్శనమిస్తున్నాయి.