IAF: ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలు కూల్చేశాం.. IAF చీఫ్ సంచలన వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి గట్టి బుద్ధి చెంపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా ఎయిర్‌ఫోర్స్‌చీఫ్ మార్షల్‌ ఏపీ సింగ్‌ సంచలన విషయాలు వెల్లడించారు.

New Update
IAF chief AP Singh says 5 Pakistani fighter jets by IAF S-400 missiles

IAF chief AP Singh says 5 Pakistani fighter jets by IAF S-400 missiles

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి గట్టి బుద్ధి చెంపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా ఎయిర్‌ఫోర్స్‌చీఫ్ మార్షల్‌ ఏపీ సింగ్‌ సంచలన విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చేశామని పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి జరిగిన నష్టం గురించి ఈ ప్రకటన రావడం ఇదే మొదటిసారి. ఇక వివరాల్లోకి వెళ్తే శనివారం బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌కు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్ ఏపీ సింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు. 

Also read: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. తవ్వకాల్లో దొరకని అస్తికలు.. ఎంత తవ్వుతున్న మట్టే!

ఆపరేషన్ సిందూర్‌ను మేము పక్క ప్రణాళికతో నిర్వహించాం. కేవలం 80 నుంచి 90 గంటల్లోనే మా లక్ష్యాలను సాధించాం. ఇరుదేశాల మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే పాకిస్థాన్‌కు భారీ మూల్యం తప్పదని వాళ్లకి అర్థమయ్యింది. ఇక చేసేదేమి లేక వాళ్లు కాళ్ల బేరానికి వచ్చారు. భారత్‌తో చర్చలు జరుపుతామంటూ సందేశాలిచ్చారు. మేము దానికి అంగీకరించాం. సిందూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశాం. 

Also Read: ట్రంప్‌కు భారత్ బిగ్ షాక్.. బెదిరింపులకు భయపడదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్

ఇంకో పెద్ద విమానాన్ని కూడా ధ్వంసం చేశాం. భారత సైన్యం దాడి చేసిన పాకిస్థాన్ ప్రధాన ఎయిర్‌ఫీల్డ్‌లలో షహబాజ్ జకోబాబాద్ స్థావం కూడా ఉంది. అక్కడే ఎఫ్‌ 16 హ్యాంగర్‌ ఉండగా మన బలగాలు దానిపై దాడి చేశాయి. ఆ తీవ్రతకు ఎఫ్‌ 16 సగానికి పైగా దెబ్బతింది. అక్కడ మరికొన్ని యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. అవి కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు మేము అంచనాకు వచ్చాం. పాక్‌పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ సమయంలో మన ఎయిర్‌ఫోర్స్‌, ఎస్‌ 400 క్షిపణి వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా పనిచేశాయని''  ఏపీ సింగ్‌ వివరించారు.  

Also Read: ఇండియన్లే భారతీయతను మర్చిపోతున్నారా..ఢిల్లీ రెస్టారెంట్ లో ఓ జంటకు అవమానం

Advertisment
తాజా కథనాలు