Big Breaking : తెలంగాణ దివ్యాంగులకు శుభవార్త..ఇకపై వారికి కూడా రూ.లక్ష

తెలంగాణలోని దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో వివాహం చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులుంటేనే రూ. లక్ష ప్రోత్సాహకం అందజేసేవారు. అయితే ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నాప్రోత్సాహం అందజేస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది.

New Update
Good news for the disabled

Good news for the disabled

Big Breaking :  తెలంగాణలోని దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత దశాబ్ధాల కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపుతూ జీవో జారీ చేసింది. కాగా గతంలో వివాహం చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులుంటేనే గతంలో రూ. లక్ష ప్రోత్సాహకం అందజేసేవారు. అయితే ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే వివాహ ప్రోత్సాహం పథకానికి అర్హులు కాదని జీవో పేర్కొంటుంది. ఈ విషయమై చాలాకాలంగా దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళా శిశు, వయవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి గా ఉన్న సీతక్క దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆమె ప్రత్యేక చొరవ తీసుకుని దివ్యాంగులకూ వివాహ ప్రోత్సాహం అందించేలా జీవో తీసుకువచ్చారు.

Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!

ఇది కూడా చదవండి: BIG BREAKING: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. హరీష్, ఈటలకు కూడా!
 
ఇక నుంచి వివాహం చేసుకున్న జంటలో ఇద్దరూ దివ్యాంగులు ఉన్నప్పటికీ  ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోను జారీ చేసింది.  గతం లో ఒకరు దివ్యాంగులు మరొకరు సాధారణ వ్యక్తి పెళ్లి చేసుకంటేనే   ప్రోత్సాహకం అందించే ప్రభుత్వ నిర్ణయాన్ని సవరించినట్లు అధికారులు తెలిపారు. తద్వారా దివ్యాంగుల సమస్యకు పరిష్కారం చూపుతూ జీవో జారీ చేసినట్లు తెలిపారు.
ఇక నుంచి ఇద్దరు దివ్యంగు లు వివాహం చేసుకున్న ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెళ్లి చేసుకున్న దివ్యాంగుల జంటలకు లక్ష రూపాయల ప్రోత్సాహం అందించనున్నట్లు  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ జీవో జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Telangana Raj Bhavan: రాజభవన్ లో దొంగతనం చేసింది అతనే.. పోలీసుల సంచలన ప్రకటన!

Also Read :  రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు