Fastest Missiles in the World: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!

ప్రపంచంలోని టాప్ 5 వేగవంతమైన క్షిపణుల్లో Avangard, DF-41, Trident II D5, Minuteman III, RS-28 Sarmat ఉన్నాయి. ఇవి Mach 20 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. శక్తివంతమైన వార్‌హెడ్‌లు, అధునాతన గైడెన్స్‌ టెక్నాలజీతో, రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.

New Update
Fastest Missiles in the World

Fastest Missiles in the World

Fastest Missiles in the World: క్షిపణులు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వాటి అద్భుత వేగం, శక్తివంతమైన విద్వాంసశక్తి,  అత్యాధునిక టెక్నాలజీ. ఇవన్నీ కలిపి తయారు చేయడానికి వందలాది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు సమష్టిగా పని చేయాల్సి ఉంటుంది. అందులో మనం మరీ ముఖ్యంగా, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి అత్యంత వేగంగా ప్రయాణించే క్షిపణుల గురించి..

క్షిపణుల వేగం ఆధారంగా వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు:

  • సబ్‌సోనిక్ (Mach 1 లోపల)
  • సూపర్‌సోనిక్ (Mach 1 - Mach 5 మధ్య)
  • హైపర్‌సోనిక్ (Mach 5 కన్నా ఎక్కువ)

ఈ ఆర్టికల్‌లో మనం ప్రపంచంలోని అత్యంత వేగంగా ప్రయాణించే టాప్ 5 క్షిపణుల గురించి తెలుసుకోబోతున్నాం, ఇవి Mach 20 అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు, అందువల్ల వాటిని గుర్తించటమూ, ఆపాలి అనుకోవడం చాలా కష్టం.

టాప్ 5 వేగవంతమైన క్షిపణులు (2025 తాజా గణాంకాల ప్రకారం)

ర్యాంక్ క్షిపణి పేరు దేశం  గరిష్ఠ వేగం
1 అవాంగార్డ్ (Avangard)  రష్యా Mach 20–27
2 డాంగ్ ఫెంగ్-41 (DF-41)  చైనా  Mach 25
3 ట్రైడెంట్ II D5  అమెరికా, బ్రిటన్ Mach 24  
4 మినిట్‌మ్యాన్ III  అమెరికా     Mach 23   
5 ఆర్‌ఎస్-28 సార్మాట్ రష్యా  Mach 20+

 

1. అవాంగార్డ్ (Avangard) - రష్యా నుండి హైపర్‌సోనిక్ డెడ్‌లీ మిస్సైల్

  • కేటగిరీ: Hypersonic Glide Vehicle (HGV)
  • వేగం: Mach 20 పైగా (సుమారు 6.8 కిమీ/సెకనుకు పైగా)
  • దూరం: 6,000 కిమీకి పైగా
  • వార్హెడ్ సామర్థ్యం: 2 మెగాటన్ న్యూక్లియర్
  • ప్రస్తుతం ఏ క్షిపణి ద్వారా ప్రయోగించబడుతోంది: SS-19
  • భవిష్యత్‌లో ప్రయోగించే అవకాశం: RS-28 Sarmat

Avangard అనేది భూమిపై మానవులు అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన క్షిపణుల్లో ఒకటి. ఇది సాధారణ బాలిస్టిక్ క్షిపణి విధానాన్ని అధిగమించి, శత్రుదేశం పైకి గ్లైడ్ చేస్తూ ప్రయాణిస్తుంది. దాని  అంచనా వేయలేనటు వంటి  వేగం, దిశ మార్పుల సామర్థ్యం శత్రువులకు దాన్ని గుర్తించడాన్ని కష్టం చేస్తుంది.

2. డాంగ్ ఫెంగ్-41 (DF-41) - చైనాకు చెందిన లాంగెస్ట్ రేంజ్ కలిగిన రోడ్-మొబైల్ ICBM

  • పుట్టిన దేశం: చైనా
  • దూరం: 12,000–15,000 కిమీ
  • వేగం: Mach 25 వరకూ
  • ప్రొపల్షన్: మూడు స్టేజీల సాలిడ్ ఫ్యూయల్
  • పేలుడు సామర్థ్యం: 10 MIRVs (న్యూక్లియర్ వార్హెడ్‌లు)
  • గైడెన్స్ సిస్టం: ఇనర్షియల్, సెలస్టియల్

ఈ క్షిపణి అత్యంత అడ్వాన్స్ గా ఉంది. డిఫెన్స్ నిపుణుల అంచనాల ప్రకారం, ఇది 10 కి పైగా విడివిడిగా లక్ష్యాలను తాకగలదు, అంటే ఒకే క్షిపణితో పలు ప్రదేశాలను ఒకేసారి లక్ష్యంగా చేసుకోవచ్చు.

3. ట్రైడెంట్ II D5 – అమెరికా, బ్రిటన్ లను రక్షించే సముద్రంలోని మిస్సైల్

  • ప్రత్యేకత: సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించబడే SLBM
  • దూరం: 12,000 కిమీ
  • వేగం: Mach 24 వరకూ
  • పేలుడు సామర్థ్యం: W76 (100 కిలోటన్నుల), W88 (475 కిలోటన్నుల)
  • బేసింగ్ ప్లాట్‌ఫామ్‌లు: ఒహియో, వాంగార్డ్ క్లాస్ సబ్‌మెరైన్లు

ఈ SLBM అద్భుతమైన రేంజ్ తో (సుమారు 90 మీటర్లు CEP) ప్రయాణించి, ఎంతో ప్రభావవంతంగా లక్ష్యాలను తాకగలదు. దీని ఖచ్చితత్వం, శక్తి దాన్ని అత్యంత పవర్ఫుల్ మిస్సైల్‌గా నిలిపాయి.

4. మినిట్‌మ్యాన్ III - అమెరికాలో అత్యంత విశ్వసనీయ ICBM

  • ప్రొడ్యూసర్: బోయింగ్
  • లాంచ్ బేస్: సైలో
  • వేగం: Mach 23 వరకూ
  • రేంజ్: సుమారు 13,000 కిమీ
  • ప్రతి క్షిపణి బరువు: 34,467 కిలోలు
  • ప్రస్తుత వినియోగం: సుమారు 400 క్షిపణులు యాక్టివ్‌గా ఉన్నాయి

ఈ మిస్సైల్ అమెరికా న్యూక్లియర్ త్రయం (Nuclear Triad)లో భూమిపై ఉండే ప్రధాన భాగం. దీని వేగం, మన్నిక, ఫాస్ట్ రెస్పాండ్ సామర్థ్యం వల్ల ఇది ఇప్పటికీ కీలకమైన రక్షణ ఆయుధంగా ఉంటుంది.

5. ఆర్‌ఎస్-28 సార్మాట్ (RS-28 Sarmat) - "సాటన్ II"గా పేరుగాంచిన రష్యన్ మిస్సైల్

  • పుట్టిన దేశం: రష్యా
  • వేగం: Mach 20+
  • బరువు: 208,100 కిలోలు
  • పేలోడ్ సామర్థ్యం: 10 టన్నులు
  • అత్యధిక శ్రేణి: 18,000 కిమీ
  • లోడ్ ఎంపికలు: MIRVs , Hypersonic Glide Vehicles

సార్మాట్ ని "సాటన్ II" అనే కోడ్ పేరుతో కూడా పిలుస్తారు. ఇది భూమిపై అత్యంత భారీగా ప్రయోగించదగిన క్షిపణుల్లో ఒకటి. దీని ద్వారా ఒకేసారి పలు లక్ష్యాలపై న్యూక్లియర్ దాడులు చేయడం సాధ్యమవుతుంది.


ఈ జాబితాలోని ప్రతి క్షిపణీ ప్రపంచ స్థాయిలో అత్యంత అధునాతన టెక్నాలజీని కలిగి ఉంది. ఇవి కేవలం వేగంతోనే కాకుండా, సమర్థత, ఖచ్చితత్వం, ధ్వంసశక్తిలోనూ అగ్రగాములుగా నిలుస్తున్నాయి. భవిష్యత్ యుద్ధాల్లో లేదా వ్యూహాత్మక రక్షణలో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు