Minister Seethakka: అమ్మాయిల జోలికొస్తే సంఘ బహిష్కరణ: మంత్రి సీతక్క వార్నింగ్
అమ్మాయిలను వేధించినా..వారిని ఇబ్బంది పెట్టినా..సంఘ బహిష్కరణ చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. రాజేంద్ర నగర్లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమశాఖ నిర్వహించిన మేధో మథన సదస్సు ముగింపులో ఆమె పాల్గొన్నారు.