BIG BREAKING: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. హరీష్, ఈటలకు కూడా!

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీష్, ఈటలకు పీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్‌ను ఆదేశించింది. జూన్ 6 హరీష్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్‌ను విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. 

New Update
kcr klswrm

Kaleshwaram project issue PC Commission notice to kcr

BIG BREAKING: కాళేశ్వరం ప్రాజెక్టులో  కేసీఆర్, హరీష్, ఈటలకు పీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్‌కు సూచించింది. జూన్ 6 హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్‌ను విచారణకు రావాలని నోటీసుల్లో స్పషం చేసింది. 

విచారణ జూలై వరకు పొడిగింపు..

ఈ నెలలోనే కమిషన్ గడువు ముగియనుండగా కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల్లో కీలక సూత్రధారి అయిన మాజీ సీఎం కేసీఆర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసేందుకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ సిద్ధమైంది. ఇందుకు సంబంధించి నివేదికను మే 22న ప్రభుత్వానికి సమర్పించాలని భావించింది. కానీ అనూహ్యంగా కమిషన్‌ విచారణను జూలై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతోంది. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా ఇందుకు సంబంధించి జీవో జారీ చేశారు. దీంతో సహజ న్యాయసూత్రాల ప్రకారం.. అవినీతి అభియోగాలపై సంజాయిషీ చెప్పుకోవడానికి కేసీఆర్‌ను విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఇచ్చిన సమాధానాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని కమిషన్‌ భావిస్తున్నట్లు సమాచారం. 

Also Read :  బార్డర్లో వరంగల్ జవాన్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని.. కారణం అదేనా?

400 పేజీల రిపోర్ట్‌

మరోవైపు ఛత్తీ్‌ష్ గఢ్‌ విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్లపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ ఇప్పటికే కేసీఆర్‌కు సమన్లు పంపించింది. దీంతో విచారణ పూర్తికాకుండానే తనను దోషిగా ప్రకటించేలా జస్టిస్‌ నర్సింహారెడ్డి ప్రకటనలు చేశారని కేసీఆర్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో నర్సింహారెడ్డి అభియోగాలపై అభ్యంతరాలు తెలిపిన సుప్రీం కోర్టు.. ఆయనను విచారణ నుంచి తప్పించింది. ఆ తర్వాత విచారణ బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌.. విద్యుత్తు కొనుగోలు, థర్మల్‌ నిర్మాణాలపై కేసీఆర్ వివరించిన లేఖనే పరిగణనలోకి తీసుకోవడం విశేషం. కాగా కాళేశ్వరంపై దాదాపు 400 పేజీల రిపోర్ట్‌ను సిద్ధం చేసిన కమిషన్.. మే 24 లోపు ప్రభుత్వానికి అందించనునంది

Also Read :  బెంగళూరులో వర్షాలే వర్షాలు.. రన్నింగ్ బస్సుల్లోకి నీళ్లు.. వీడియోలు వైరల్!

'తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయం'.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శేరిలింగంపల్లిలో నాటి పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. రేవంత్ రెడ్డే సీఎం అయ్యారు. కాళేశ్వరంపై విచారణకు కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. మరో రెండు నెలల్లో ఆ కమిటీ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు