Indus Waters Issue: తుల్ బుల్ ప్రాజెక్టుపై రచ్చ.. కాశ్మీర్ సీఎం ఒమర్ వర్సెస్ పీడీపీ ఛీఫ్ ముఫ్తీ

సింధుజాలాలు...తుల్ బుల్ ప్రాజెక్టులకు సంబంధించి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ ఛీఫ్ ముఫ్తీ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. తుల్ బుల్ ప్రాజెక్టును ప్రారంభించాలని ఒమర్ అంటే..చల్లారిన మంటను రేపుతున్నారని ముఫ్తీ అన్నారు.

author-image
By Manogna alamuru
New Update
Kashmir

Omar Abdullah vs Mehbooba Mufti

Indus Waters Issue: సింధుజలాలపై తుల్ బుల్ ప్రాజెక్టును(The Tulbul Project) 1980లో చేపట్టారు. కానీ దీనిని అప్పట్లో పాకిస్తాన్(Pakistan) ఒప్పందం పేరుతో అడ్డుకుంది. అప్పటి నుంచి అది నడవడం లేదు. దానిని మళ్ళీ ప్రారంభించాలని  జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Jammu and Kashmir Chief Minister Omar Abdullah) అన్నారు. సింధు జలాల ఒప్పందం రద్దు చేసిన నేపథ్యంలో తుల్‌‌బుల్ ప్రాజెక్టును పూర్తిచేస్తే, జీలం నదిని నావిగేషన్‌‌గా ఉపయోగించుకునేందుకు వీలుంటుందను చెప్పారు.

Also Read: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిసైల్ ఇదే..! ధర ఎంతంటే?

అంతేకాకుండా దిగువ ఉన్న ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడుతుంది అని కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఒమర్ అబ్దుల్లా.  దీనికి పీడీపీ ఛీఫ్ ముఫ్తీ రిప్లై ఇచ్చారు. యుద్ధం అంచుల వరకూ వెళ్ళిన భారత్, పాక్ ఇప్పుడే శాంతించాయి. ఈ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడి ఇరు దేశాలను రెచ్చగొట్టడం అవసరమా అంటూ ఆమె సీఎంపై విరుచుకుపడ్డారు. జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయం. ఇది ద్వైపాక్షిక అంశాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చే ప్రమాదం ఉందని అన్నారు. 

Also Read :  ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్

పాక్ ప్రయోజనాల కోసం..

ముఫ్తీ కామెంట్లకు సీఎం ఒమర్ కూడా మళ్ళీ రిప్లై ఇచ్చారు. సింధు జలాల ఒప్పందం జమ్మూకాశ్మీర్‌‌‌‌కు జరిగిన చారిత్రక ద్రోహం...ముందు మీరు దానిని అంగీకరించాలి. అది చేయకుండా పబ్లిసిటీ కోసం పక్క దేశ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారంటూ ఒమర్...ముఫ్తీపై మండిపడ్డారు. నేను మొదటి నుంచీ సింధుజలాల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాను. దానిపై ఎప్పటికీ నిలబడే ఉంటాను. ఇది యుద్ధోన్మాదం కాదు. మన నీరు మన ప్రజలే వాడుకోవాలి అంటూ ముఫ్తీకి బదులిచ్చారు.  

Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?

Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?

today-latest-news-in-telugu | jammu-kashmir | CM Omar Abdullah | sindhu water treaty 

Also Read: IDF: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు 115 మంది మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు