Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం

మహబూబ్‌నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం రాత్రి భూమి కంపించినట్లు ప్రచారం జరిగింది. భారీ శబ్దంతో పాటు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

New Update
Earthquake

Earthquake

మహబూబ్‌నగర్(mahabubnagar) హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం రాత్రి భూమి కంపించినట్లు ప్రచారం జరిగింది. భారీ శబ్దంతో పాటు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే దీనిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. ఈ ఏరియాలో ఏమైనా తవ్వకాలు లేదా పేలుళ్లు చేపట్టారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ట్రంప్‌‌లా మోదీ ఎందుకు చేయలేదు.. వెనిజులా ఘటనపై ఒవైసీ రియాక్షన్‌!

Earthquake Strikes

మరోవైపు  అస్సాం(assam), త్రిపుర(tripura) లోని పలు ప్రాంతాల్లో  భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరిగావ్‌లో భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1గా నమోదైంది. త్రిపురలోని గోమతిలో 3.9 తీవ్రతగా రికార్డయ్యింది. మోరిగావ్‌కు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం ప్రభావంతో మేఘాలయాలో కూడా పలు చోట్లు స్వల్పంగా భూప్రకంపనలు నమోదయ్యాయి.  

Also Read :  ప్రియాంక గాంధీకి హైకమాండ్ కీలక బాధ్యతలు

Advertisment
తాజా కథనాలు