Supreme Court: ఆ రాష్ట్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే ?
సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా ఆ రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయుల్ని వెంటనే పంపివేయకుండా నిర్బంధ కేంద్రాల్లో ఉంచడంపై మండిపడింది. వాళ్లని స్వస్థలాలకు పంపించేందుకు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా అని ప్రశ్నించింది.