Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి హైకమాండ్ కీలక బాధ్యతలు

ఈ ఏడాది అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీకి హస్తం పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అక్కడ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆమెను నియమించింది.

New Update
Priyanka Gandhi heads panel to shortlist Assam Congress candidates

Priyanka Gandhi heads panel to shortlist Assam Congress candidates

ఈ ఏడాది అస్సాం(assam) లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections 2025) జరగనున్న సంగతి తెలసిందే. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ(priyanka-gandhi) కి హస్తం పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అక్కడ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆమెను నియమించింది. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. 

Also Read: ట్రంప్‌‌లా మోదీ ఎందుకు చేయలేదు.. వెనిజులా ఘటనపై ఒవైసీ రియాక్షన్‌!

Priyanka Gandhi Heads Panel To Shortlist

ప్రియాంక గాంధీ కమిటీలో లోక్‌సభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్‌ ఉలకతో సహా సిరివెల్ల ప్రసాద్‌ను కూడా సభ్యులుగా నియమించారు. ఎన్నికల్లో ఎవరికీ టికెట్లు ఇవ్వాలి?, ఎన్నికల ముందు జరగాల్సిన అంతర్గత సంప్రదింపులు వంటివి ఈ కమిటీ నిర్వహిస్తుంది. అంతేకాదు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ కూడా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.  

Also read: కోతులకు భయపడుతున్న MLAలు.. అసెంబ్లీలో మిమిక్రీ ఆర్టిస్టుల నియామకం

Advertisment
తాజా కథనాలు