/rtv/media/media_files/2025/09/20/hyderabad-man-learns-chain-snatching-on-youtube-caught-in-first-attempt-2025-09-20-20-20-33.jpg)
hyderabad man learns chain snatching on youtube caught in first attempt
డబ్బు కోసం ఎంతకైనా తెగించేవారు ప్రస్తుత సమాజంలో పెరిగిపోయారు. మంచి మానవత్వం మరిచి కొందరు డబ్బు కోసం క్రూర మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. ఈజీగా మనీ సంపాదించి జల్సాలు చేయాలని గట్టిగా ఫిక్సై.. దారుణాలకు పాల్పడుతున్నారు. దీనికితోడు ఇప్పుడున్న టెక్నాలజీతో వారి పని మరింత సులువు అవుతుండటంతో చెలరేగిపోతున్నారు. కొందరు ఎంతో కష్టపడి కాయకష్టం చేసుకుంటూ డబ్బు సంపాదిస్తుంటే.. మరికొందరు అదే డబ్బు కోసం దొంగలుగా మారి.. అమాయకుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు.
Also Read : చావు పిలుస్తోందంటూ చెరువులో దూకిన భర్త...భర్తతో పాటే తానంటూ భార్య..
తొలి ప్రయత్నంలోనే దొరికాడు
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వారికి స్మార్ట్‌ఫోన్(Smartphone) ఒక ఆయుధంగా మారింది. ఇది ఒక కమ్యూనికేన్ సోర్స్ మాత్రమే కాకుండా స్కిల్ సోర్సుగా కూడా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి పరిష్కారం స్మార్ట్‌ఫోన్ ద్వారానే అయిపోతుంది. దీనిని కొందరు మంచి విషయాల కోసం ఉపయోగిస్తే మరికొందరు తప్పుదారి కోసం యూజ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు తన స్మార్ట్‌ఫోన్‌ను అలాంటిదాని కోసమే ఉపయోగించి కటకటాలపాలయ్యాడు.
ఓ యువకుడు ఈజీ మనీ(Easy Money) సంపాదించాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఇందులో భాగంగానే తన స్మార్ట్‌ఫోన్‌ను ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. గూగుల్, యూట్యూబ్‌లలో చైన్ స్నాచింగ్(chain snaching) ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి? ఎవరి వద్ద చేయాలి? చేసి ఎలా తప్పించుకోవాలి? ఎంత బంగారం, ఎంత డబ్బు వస్తుంది?.. ఇలాంటి విషయాలన్నీ సెర్చ్ చేసి గంటల తరబడి వీడియోలు చూశాడు. చివరికి నేర్చుకున్న దాన్ని నిజ జీవితంలో టెస్ట్ చేయాలనుకున్నాడు. మొత్తంగా టెస్ట్ చేసుకుని పోలీసులకు దొరికాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అతడి పేరు షేక్ అలీమ్. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో మెడలో బంగారం వేసుకున్న మహిళల కోసం ఎదురుచూశాడు. సరిగ్గా అదే టైంకి ఓ యువతి రోడ్డు దాటుతూ కనిపించింది. ఆమె మెడలో బంగారం గొలుసు చూశాడు. ఎలాగైనా దాన్ని కొట్టేయాలని వెనకనుంచి వెళ్లి ఒక్కసారిగా బంగారు గొలుసు లాక్కుని పరిగెత్తాడు.
అది గమనించిన ఆ యువతి గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో అక్కడే సివిల్ డ్రెస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ ఆమె కేకలు విని ఆ నిందితుడి వెనుక పరిగెత్తారు. అచ్చం సినిమాలో చూసినట్లు.. నడిరోడ్డుపై నిందితుడి వెనుక కానిస్టేబుల్స్ సిద్ధార్థ్, విక్రం పరిగెత్తి చివరికి నిందితుడు షేక్ అలీమ్‌ను పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్టు చేసి నిందితుడి వద్ద నుంచి 15 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : మీకంటే మృగాలు నయంరా..సంచలన హత్యలు..భార్యలను చంపిన భర్తలు