Kalki 2: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?

కల్కి 2898 AD సీక్వెల్ పెద్ద బడ్జెట్‌తో, భారీ అంచనాలతో తెరకెక్కనుంది. మూవీ నుండి దీపికా తప్పుకోవడంతో, నాగ్ అశ్విన్ ఎవరిని హీరోయిన్ గా తెస్తాడు అన్నదానిపై అందరి దృష్టి పడింది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరి ఖాతాలో పడుతుందో చూడాలి!

New Update
Kalki 2

Kalki 2

Kalki 2: నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన సై-ఫై ప్రాజెక్ట్ కల్కి 2898 AD భారీ విజయం సాధించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా ఇందులో దీపికా పదుకునే(Deepika Padukone) పాత్రకు మంచి స్పందన లభించింది. కానీ తాజాగా దీపికాను 'కల్కి' సీక్వెల్ నుండి తొలగించినట్లు మేకర్స్ తెలిపారు.

అసలు ఎందుకు బయటకు వెళ్లింది దీపికా? (Deepika Padukone Out From Kalki 2)

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, దీపికా పాత్ర ఫిక్స్ అయిన తర్వాత ఆమె నుండి అనవసరమైన డిమాండ్స్ మొదలయ్యాయట. ఎక్కువ రెమ్యునరేషన్, పెద్ద టీమ్ కావాలనే షరతులు, సినిమాకు సంబంధం లేని కొన్ని విషయాలు ఆమె ప్రవర్తనలో కనిపించాయట. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్ణయం తీసుకుని ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారు అని సమాచారం.

Also Read: దుమ్మురేపుతున్న 'OG' సెన్సార్ టాక్.. ఊచకోతేనట..!

మరి నెక్స్ట్ హీరోయిన్ ఎవరు..?

ఇప్పుడు దీపికా స్థానాన్ని రీప్లేస్ చేయడం దర్శకుడి ముందున్న పెద్ద టాస్క్. ఈ పాత్రకు బలం ఉండటంతో, అందులో నటించే నటి బాగా పర్ఫామ్ చేయగలిగే హీరోయిన్ కావాలి. సోషల్ మీడియా, ఇండస్ట్రీ వర్గాల్లో రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి - అనుష్క శెట్టి, ప్రియాంక చోప్రా(Priyanka Chopra).

Also Read: Shanmukh Jaswanth: 'ప్రేమకు నమస్కారం' అంటున్న షణ్ముఖ్.. కొత్త సినిమా గ్లింప్స్ అదిరింది బ్రో !

ప్రభాస్‌(Prabhas)తో కలిసి బాహుబలి సిరీస్‌లో నటించిన అనుష్క శెట్టి(Anushka), పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్‌ను సంపాదించారు. ఆమెకు ఉన్న గ్రేస్, పవర్‌ఫుల్ పాత్రల్లో నటించిన అనుభవంతో 'కల్కి-2'లోని దీపికా పాత్రను (సుమతి పాత్రను) బాగా చేయగలదని ఫ్యాన్స్ అభిప్రాయం. ముఖ్యంగా, ప్రభాస్ పక్కన కరెక్ట్ మ్యాచ్ అయ్యే హీరోయిన్ అనుష్క అనే అభిప్రాయం బలంగా ఉంది.

Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!

ఇంకొపక్క ప్రియాంక చోప్రా పేరు కూడా సోషల్ మీడియాలో గట్టిగా  వినిపిస్తోంది. ఆమెకు ఉన్న గ్లోబల్ ఫాలోయింగ్, హాలీవుడ్ అనుభవం 'కల్కి-2' సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

మరికొంతమంది  ప్రియాంక ఇప్పటికే రాజమౌళి-మహేష్ బాబు సినిమాలోనూ నటిస్తోంది. ఆ సినిమా తర్వాత 'కల్కి-2 'వస్తే, అప్పటికి ప్రియాంక క్రేజ్ టాప్ లో ఉంటుంది. ఆ క్రేజ్‌ను కల్కి టీమ్ ఉపయోగించుకోవచ్చు అని అంటున్నారు.

Also Read:'ము.. ము.. ముద్దంటే చేదా..?’ ఇంట్రెస్టింగ్ గా 'కిస్' ట్రైలర్..

దీపికా పదుకొణె తప్పుకున్నా, 'కల్కి-2' టీమ్ మాత్రం సినిమాపై ధీమాగా ఉన్నారు. ఎందుకంటే మొదటి భాగం హిట్ కావడం, ప్రభాస్ పాప్యులారిటీ, కంటెంట్ మీద నమ్మకం ఇవన్నీ కలిపి సినిమా మీదే కాదు, కొత్తగా వచ్చే హీరోయిన్ ఎవరైనా సరే మాకు ఇబ్బంది లేదు అంటూ మూవీ టీం కాన్ఫిడెంట్ గా ఉన్నారు.  

ఇప్పుడు అనుష్క వస్తుందా? లేక ప్రియాంకానా? లేక ఇంకెవరో సర్ప్రైజ్ హీరోయిన్ వచ్చి షాకిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు