అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై వాడీవేడీగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు నిజాం కంటే శ్రీమంతుడు కావాలనే దురాశ కలిగిందేమో అందుకే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారంటూ విమర్శించారు. అలాగే అబద్ధపు మాటలతో మాజీ మంత్రి హరీశ్‌రావు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతి ప్రాణహిత చేవెళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారని పేర్కొన్నారు. 2015లో కేంద్రమంత్రి తెలంగాణ ప్రభుత్వానికి పంపిన లేఖలో సీఎం రేవంత్ సభలో చదివారు.
Also read: వినాయక విగ్రహాలపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టుకోవచ్చని అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతి లేఖలో పేర్కొన్నారు. హైడ్రాలజ క్లియరెన్స్ ఉందని చెప్పారు. కానీ బీఆర్ఎస్ మాత్రం దురాశ, దోపిడి కోసం దీనిపై మళ్లీ విచారణ చేయాలని కోరింది. కేంద్రం రాసి పంపిన లేఖను మళ్లీ పరిశీలించాలని అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు అధికారులను కోరారు. 2009లోనే అప్పటి కేంద్రమే ప్రాజెక్టు కట్టుకోవాలని క్లియర్‌గా చెప్పేసింది. కానీ హరీశ్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక వ్యవస్థలను తప్పుదోవ పట్టించారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది.
Also Read: తల్లిని చంపి ఆత్మహత్య చేసుకోమన్న చాట్ GPT.. 2 ప్రాణాలు బలి తీసుకున్న AI
రాష్ట్ర సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. పదేపదే తప్పుడు సమాచారాన్ని చెబతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రికార్డు నుంచి తీసివేయాలి. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009, 2014లో లేఖలు రాశారు. చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు వినలేదు. మహారాష్ట్రతో కూడా ప్రాజెక్టు ఎత్తు గురించే చర్చ జరిగింది. ముంపు ప్రాంతం తగ్గుతుందనే ఎత్తు తగ్గించుకోవాలని అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. తెలంగాణ ప్రజల రూ.లక్ష కోట్లు కాజేసేందుకే ఇలా చేశారు. నిజాం కంటే శ్రీమంతుడు కావాలని కేసీఆర్‌కు దూరాశ కలిగిందేమో ? అందుకే ప్రాజెక్టు మేడిగడ్డ వద్దే కట్టాలని అప్పటికీ కేసీఆర్, హరీశ్ రావు నిర్ణయం తీసుకున్నారని'' సీఎం రేవంత్ అన్నారు.
Also Read: 3 రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. కట్ చేస్తే నదిలో మృతదేహం
మరోవైపు పీసీ ఘోష్‌ల కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్‌పై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే హరీష్ రావు సిగ్గులేకుండా అసెంబ్లీలో నవ్వుకుంటున్నారని ఉత్తమ్ తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం నివేదికపై తనకు మాట్లాడేందుకు రెండు గంటల సమయం ఇవ్వాలని కోరగా స్పీకర్ అరగంట మాత్రమే సమయం ఇచ్చారని హరీశ్ రావు అన్నారు. 650పేజీలపై అరగంటలో ఎలా సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. ఉత్తమ్ మాట్లాడుతూ ప్రాణహిత--చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారంటూ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలా ఉన్న మేడిగడ్డ దెబ్బతిందని ధ్వజమెత్తారు . గత 20 నెలల నుంచి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా మారాయంటూ ఆరోపించారు.
Also Read: డ్యామ్‌కు, బ్యారేజీకు తేడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు : మంత్రి ఉత్తమ్
Telangana: కేసీఆర్‌కు నిజాం కంటే ధనవంతుడు కావాలనే దురాశ.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై వాడీవేడీగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు నిజాం కంటే శ్రీమంతుడు కావాలనే దురాశ కలిగిందేమో అందుకే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారంటూ విమర్శించారు.
CM Revanth