AI Chat GPT: తల్లిని చంపి ఆత్మహత్య చేసుకోమన్న చాట్ GPT.. 2 ప్రాణాలు బలి తీసుకున్న AI

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్ని లాభాలు అంతే నష్టాలు కూడా ఉన్నాయి. ఓ వ్యక్తి చేసిన పనికి చాట్ GPT కారణంగా రెండు ప్రాణాలు పోయాయి. ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ చెప్పిందని 56 ఏళ్ల వ్యక్తి తన తల్లిని హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
US Man Kills Mother

US Man Kills Mother

రాను రాను మనిషి మెషిన్‌గా తయారవుతున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) ద్వారా ఎన్ని లాభాలు అంతే నష్టాలు కూడా ఉన్నాయి. ఓ వ్యక్తి చేసిన పనికి చాట్ GPT(AI Chat GPT) కారణంగా రెండు ప్రాణాలు పోయాయి. ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ చెప్పిందని 56 ఏళ్ల వ్యక్తి తన తల్లిని హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన స్టెయిన్-ఎరిక్ సోయెల్‌బర్గ్ తన తల్లి సుజానే ఎబెర్సన్ ఆడమ్స్‌తో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల సోయెల్‌బర్గ్ తరచూ చాట్‌జీపీటీతో మాట్లాడుతున్నట్లు, దాని నుంచి సలహాలు తీసుకుంటున్నట్లు అతని స్నేహితులు తెలిపారు. చాట్‌జీపీటీ అతన్ని నిరాశ, ఒంటరితనం నుంచి బయటపడేయడానికి సలహాలు ఇస్తున్నట్లు నమ్మాడు. ఈ క్రమంగా ఆ సంభాషణలు అతన్ని తీవ్రమైన మానసిక గందరగోళానికి గురిచేశాయని పోలీసులు భావిస్తున్నారు.

Also Read :  ఏదో జరగబోతోంది.. చైనా ప్రధానికి ఇష్టమైన కారు మోదీకి కేటాయింపు

AI Chat GPT Says - US Man Kills Mother

మృతుడు స్టెయిన్-ఎరిక్ సోల్బర్గ్ (56), యాహూ కంపెనీలో మాజీ మెనేజర్. అతడు తన 83 ఏళ్ల తల్లి సుజానే ఎబర్సన్ ఆడమ్స్‌ను కాల్చి చంపిన తర్వాత, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నివేదికల ప్రకారం, సోల్బర్గ్ గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడు చాట్‌జీపీటీతో "బాబీ" అనే పేరుతో మెస్సే్జ్‌లు చేసేవాడు. స్టెయిన్-ఎరిక్ సోల్బర్గ్ అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ అతన్ని తప్పుదోవ పట్టింది. అతని తల్లి స్టెయిన్-ఎరిక్ సోల్బర్గ్‌ను చంపడానికి డ్రగ్స్ ఇచ్చిందని.. అతని కారులో స్పై కెమెరాలు పెట్టిందని అనుమానాలు రేకెత్తించింది చాట్ జీపీటీ. స్టెయిన్-ఎరిక్ సోల్బర్గ్ నెమ్మదిగా చాట్ జీపీటీ ట్రాప్‌లో పడ్డాడు. తల్లిపై పగ పెంచుకున్నాడు. ఆగస్ట్ 5న ఆమెను స్టెయిన్-ఎరిక్ సోల్బర్గ్ కొట్టి చంపాడు. తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకునేలా AI చాట్ జీపీటీ ప్రేరేపించింది. దర్యాప్తులో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి.

Also Read :  విదేశీ విద్యార్థులపై ట్రంప్ భారీ బాంబు.. ఎఫ్ 1 వీసాపై ఇకపై అమెరికా వెళ్లడం కష్టమే!

నిపుణుల హెచ్చరికలు:
ఈ సంఘటనపై మానసిక నిపుణులు, సాంకేతిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ సాధనాలు చాలా శక్తివంతమైనవని, కానీ వాటికి ఎమోషన్స్, నైతిక విలువలు ఉండవని హెచ్చరించారు. మానసిక సమస్యలు ఉన్నవారు ఏఐ సహాయం కోరడం ప్రమాదకరమని, వారు వెంటనే నిపుణులైన మానసిక వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసేవారు, దుర్వినియోగం కాకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆత్మహత్యలు లేదా హింసను ప్రోత్సహించే సమాచారాన్ని నివారించేలా ప్రోగ్రామ్ చేయాలని అభిప్రాయపడ్డారు.

Advertisment
తాజా కథనాలు