/rtv/media/media_files/2025/08/31/body-of-missing-bengaluru-woman-found-in-kollur-2025-08-31-18-45-36.jpg)
Body of missing Bengaluru woman found in Kollur
బెంగళూరు(Bengaluru) లో మూడు రోజుల క్రితం ఓ మహిళ అదృశ్యమయ్యింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత గాలించిన ఆచూకి లభించలేదు. చివరికి ఆదివారం ఓ నదిలో ఆమె మృతదేహం దొరికింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు షాకైపోయారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని త్యాగరాజనగర్‌లో ఉంటున్న సీఆర్ గోవిందరాజులు కూతురు వసుధ చక్రవర్తి(45).
Also Read: తల్లిని చంపి ఆత్మహత్య చేసుకోమన్న చాట్ GPT.. 2 ప్రాణాలు బలి తీసుకున్న AI
Bengaluru Woman Body Missing
ఈమె తరచుగా ఉడుపి జిల్లా కొల్లూరులోని మూకాంబిక ఆలయం వద్దకు వెళ్లేది. అక్కడ దేవి దర్శనం చేసుకునేది. అయితే ఎప్పటిలాగే ఆగస్టు 28న ఆమె తన కారులో బెంగళూరు నుంచి కొల్లురుకు వచ్చారు. ఓ లాడ్జిలో ఉన్నారు. మరుసటి రోజు తల్లిదండ్రులు ఆమెకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చేసినా సమాధానం రాకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించారు. అలాగే స్థానికులను విచారించారు.
Also Read: మెట్రో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్..!
ఆరోజున ఆమె చాలా టెన్షత్ ఉంటడం చూశామని కొందరు స్థానికులు చెప్పారు. ఒంటరిగా, వేగంగా వెళ్తుండటం చూశామని తెలిపారు. మరికొందరు ఆమె ఆలయం దగ్గర్లోని సౌపర్ణిక నది వైపు వెళ్లారని.. అందులో దూకి ప్రవాహంలో కొట్టుకుపోయిం ఉండొచ్చని చెప్పారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్ల నదిలో ఆమె కోసం గాలించారు. ఆదివారం ఆమె మృతదేహం దొరికింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె మరణంపై కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె సూసైడ్ చేసుకుందా ? లేదా ఎవరైనా హత్య చేశారా ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: దారుణం.. ఆస్తిలో వాటా ఇవ్వాలని.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన కొడుకులు!