వినాయక విగ్రహాలపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇష్టం వచ్చిన రూపాల్లో గణేష్ విగ్రహాలను పెట్టొద్దని రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. అలా చేస్తే హిందూ మతానికే అవమానం అని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఇష్టం వచ్చిన రూపాల్లో విగ్రహాలను తయారు చేసినా మండపాల్లో పెట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాజాసింగ్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
కాగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయక విగ్రహాన్ని ఓ అభిమాని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇది తీవ్ర చర్చకు దారితీసింది. గోషామహల్ నియోజకవర్గం ఆఘపురలో ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఒక వినాయక మండపం ఏర్పాటు చేశారు. వినాయకుడికి బదులుగా సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడిని అక్కడ ప్రతిష్టించారు. దేవుడి రూపంలో కాకుండా ఇలా రేవంత్ రెడ్డి గెటప్ ఉన్న వినాయకుడిని ప్రతిష్టించడం సరికాదని భక్తులు మండిపడ్డారు.
దీనిపై హిందూ సమాజ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా మండిపడ్డారు. వినాయకుని విగ్రహం ఇలా ఏర్పాటు చేయడం ఏ మాత్రం సరికాదని తెలిపారు. వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించే విధంగా చేయాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌కు రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు. దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని రాజాసింగ్ అన్నారు.
ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ఎప్పుడంటే
మరోవైపు ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం 2025 సెప్టెంబర్ 6 అనంత చతుర్దశి రోజున జరగనుంది. ఈ మేరకు ఉత్సవ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉండటం వల్ల ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కాగా ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతిని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తులో ప్రతిష్టించారు. నిమజ్జనం రోజున ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసేందుకు పోలీసులు , ఇతర ప్రభుత్వ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు ఆదివారం కావడంతో ఖైరతాబాద్ మహా గణపతిని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
Also Read : Telangana: కేసీఆర్‌కు నిజాం కంటే ధనవంతుడు కావాలనే దురాశ.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక విషయంలో అసంతృప్తితో రాజాసింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేశానని ప్రకటించారు. జులై 11, 2025న బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది. రాజాసింగ్ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత, ఆయన రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. రాజాసింగ్ కు బీజేపీతో విభేదాలు కొత్తవి కావు. గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయనను పార్టీ సస్పెండ్ చేయడం, ఆ తర్వాత తిరిగి 2023 ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అయితే తాజా పరిణామాలు మాత్రం తీవ్రంగా మారాయి.
Also Read : Screwworm: వామ్మో.. మెక్సికోలో మనిషి మాంసం తినే స్క్రూవార్మ్స్.. మన దేశానికి పొంచి ఉన్న ముప్పు!!
MLA Raja Singh : వినాయక విగ్రహాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
వినాయక విగ్రహాలపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇష్టం వచ్చిన రూపాల్లో గణేష్ విగ్రహాలను పెట్టొద్దని రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. అలా చేస్తే హిందూ మతానికే అవమానం అని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.