Minister Uttam : డ్యామ్‌కు, బ్యారేజీకు తేడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు : మంత్రి ఉత్తమ్‌

అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాణహిత-చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, ఈ ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ దెబ్బతిందన్నారు.

New Update
kaleshwaram

తెలంగాణ ఏర్పడ్డాక అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాణహిత-చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ దెబ్బతిందన్నారు. 20 నెలలుగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. 

వాప్కోస్‌ రిపోర్ట్‌ కంటే ముందే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలని అప్పటి ప్రభుత్వం డిసైడయ్యింది. వాప్కోస్‌ రిపోర్ట్‌ ఇచ్చినరోజే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించాలని ఆదేశించింది. ఏడాది 195 TMCల నీళ్లను ఎత్తిపోస్తామని చెప్పారు. ఐదేళ్లు కలిపి 125 TMC నీళ్లను మాత్రమే ఎత్తిపోశారు. ఇందులో 35 TMCల నీళ్లను సముద్రంలోకి వదిలిపెట్టారు. లక్షకోట్లతో కట్టిన ప్రాజెక్టుతో ఐదేళ్లలో వాడుకున్న నీళ్లు 101 TMCలు మాత్రమేనని మంత్రి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి విపత్తు ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు మంత్రి ఉత్తమ్ అన్నారు. 

Also Read : MP Mahua Moitra : ఎంపీ మహువా మొయిత్రాకు బిగ్ షాక్.. కేసు నమోదు!

అరగంట మాట్లాడాలి అంటే ఎలా

డ్యామ్‌కు, బ్యారేజీకు తేడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేశారని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో ఉందన్నారు. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారని పేర్కొన్నారు. మరోవైపు  650 పేజీల పుస్తకం ఇచ్చి అరగంట మాట్లాడాలి అంటే ఎలా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కమిషన్ ఇచ్చిన 650 పేజీల రిపోర్ట్ మీద ఒక్కో పేజీకి, ఒక్కో అక్షరానికి తాను సమాధానం చెప్తానని తెలిపారు. మాట్లాడడానికి నాకు కనీసం రెండు గంటల సమయం కావాలన్నారు.  వరదలు, యూరియా కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరదలపై చర్చిద్దామని బీఏసీలో కోరాం. వరద మాకు ముఖ్యం కాదని ప్రభుత్వం అనుకుంది. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధమని హరీష్ రావు తెలిపారు. 

Also Read :  Ram Charan : సీఎం సిద్ధరామయ్యతో రామ్ చరణ్ భేటీ.. ఎందుకంటే?

ఘోష్‌ కమిషన్‌ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని హరీష్ రావు అన్నారు. కమిషన్లను పొలిటికల్‌ వెపన్‌గా వాడుకోవద్దని కోర్టులు గతంలోనే చెప్పాయని గుర్తు చేశారు. నిబంధనలు అనుసరించలేదనే కోర్టకు వెళ్లామని, ఆదివారం రిపోర్ట్‌ పెట్టారంటేనే కుట్ర ఉన్నట్టుగా ఆయన ఆరోపించారు. అందుకే సుప్రీంకోర్టులో సీఎం కేవియేట్‌ వేశారని అన్నారు. కోర్టులో వాదనలు ఉన్నాయనే ఆదివారం కూడా చర్చ పెట్టారని అన్నారు. పారదర్శకంగా విచారణ జరగకపోతే చిత్తు కాగితంతో సమానమని కోర్టులు చెప్పాయని -హరీష్‌ రావు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు