/rtv/media/media_files/2026/02/17/cm-revanth-reddy-2026-02-17-16-06-33.jpg)
CM Revanth Reddy
ఆర్థిక రాజధాని ముంబయి(mumbai) లో ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 'ముంబయి క్లైమేట్ వీక్' సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్(cm revanth) ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఈరోజు రాత్రికి ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్నారు. రేపు జరగబోయే ఈ సదస్సుకు సీఎం హాజరుకానున్నారు. పర్యావరణ హితమైన పాలన, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాల గురించి ఆయన చాటిచెప్పనున్నట్లు తెలుస్తోంది.
Also Read: బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్ :ఏడాదికి 2 ఇంజెక్షన్లు చాలు.. ఇక ట్యాబ్లెట్లు బంద్!
ముంబయి క్లైమేట్ వీక్ అంటే ?
ముంబయి క్లైమేట్ వీక్(Mumbai Climate Week) అనేది భారత్(india) లో మొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఓ పౌర-నేతృత్వ పర్యావరణ ఉద్యమం. మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 'ప్రాజెక్ట్ ముంబై' స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు30 దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, పర్యావరణ నిపుణులు పాల్గొననున్నారు.
సీఎం రేవంత్ తెలంగాణను పర్యావరణహిత పారిశ్రామిక హబ్‌గా మార్చాలనే టార్గెట్‌తో ఈ వేదికను ఎంచుకున్నారు. రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ లాంటి పునరుత్పాదక ఇంధ ప్రాజెక్టులను విస్తరించేందుకు పెట్టుబడులను ఆకర్షించనున్నారు. అలాగే తెలంగాణను 2047 నాటికి అగ్రగ్రామిగా నిలపాలనే టార్గెట్‌లో భాగంగా పర్యావరణ సమతుల్యతతో అభివృద్ధి ఎలా ఉండనుందో వివరించనున్నారు. ముసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ నిర్మాణాలపై అంతర్జాతీయ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు కోరనున్నారు. బిల్ గేట్స్, హిల్లరీ క్లింటన్ లాంటి అంతర్జాతీయ నేతలు, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కలిసి పర్యావరణ నిధుల సమీకరణపై సీఎం రేవంత్ చర్చించే అవకాశం ఉంది.
Also Read: నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు..లొంగిపోవాలని ఆదేశం
వాతావరణ మార్పులకు తట్టుకునేలా వ్యవసాయం చేయడం, శిలాజ ఇంధనాల నుంచి గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్లడం, పట్టణాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పించడం లాంటివి ఈ సదస్సులో కీలక అంశాలుగా మారనున్నాయి. ఇటీవల దావోస్ వరల్డ్ ఎకనామిక్‌లో ఫోరమ్‌లో పాల్గొన్న రేవంత్ భారీగా పెట్టుబడులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ముంబై క్లైమేట్ వీక్ ద్వారా కూడా పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నించనున్నారు.
Follow Us