/rtv/media/media_files/2026/02/17/fotojet-12-2026-02-17-11-31-58.jpg)
Heroine Prathyusha Case
Heroine Prathyusha Case: తెలుగు సినీనటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్ధాలుగా సాగుతున్న ఈ కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పునిచ్చింది. కాగా ఆమె మృతికి కారణమని భావిస్తున్న సిద్ధార్థరెడ్డి పిటిషన్‌ను ఈ రోజు కోర్టు డిస్మిస్ చేసింది.ఆయనను నాలుగువారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. సిద్ధార్థరెడ్డికి గతంలో సెషన్స్ కోర్టు ఐదుసంవత్సరాల జైలు శిక్ష విధించగా సుప్రీంకోర్టు శిక్షను రెండు సంవత్సరాలకు కుదించింది. గత ఏడాది నవంబర్‌లో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది.సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మనోజ్ మిశ్ర, మన్మోహన్‌లతో కూడిన ధర్మసనం తుది తీర్పువెలువరించింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రంగ ప్రవేశం చేసిన ప్రత్యూష అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తన అందంతో తక్కువ సమయంలో మంచి సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. అలాంటి ప్రత్యూష చిన్న వయసులోనే మరణించడం అప్పట్లో కలకలం సృష్టించింది. దీన్ని ఇప్పటికీ ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ఈ కేసు విషయంలో నాటి పోలీసు విచారణ పైన ఎన్నో అభ్యంతరాలతో పాటు, ఆరోపణలు కూడా వెలువెత్తాయి. ప్రత్యూష ఆత్మహత్య కేసులో అప్పటి ప్రభుత్వంలో ఉన్న పలువురు మంత్రుల కుమారుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించింది నాటి రాష్ట్ర ప్రభుత్వం. విచారణ జరిపిన సీబీఐ సిద్ధార్థరెడ్డిని మరణానికి ప్రోత్సహించినట్లు పేర్కొంటు నిందితుడిగా చేర్చింది. దీంతో ఆయనకు ఏడేళ్ల శిక్ష విధించింది. దీనిపై ప్రత్యూష తల్లి హైకోర్టును ఆశ్రయించిందిజ అయితే హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లేవని, అతని జైలు శిక్షను రెండున్నర ఏళ్లకు కుదించింది. అనంతరం 2011లో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రత్యూష కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. దీనిపైన సుప్రీంకోర్టు విచారణ జరపడం మొదలు పెట్టింది. అలా అప్పటినుంచి సుమారుగా 14 ఏళ్లపాటు సుప్రీంకోర్టులోనే ఈ విచారణ కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజున తుది తీర్పును వెల్లడించింది.
అసలేం జరిగిందంటే
ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు.ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా... సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. అయితే 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7.30-8 గంటల మధ్య వారిద్దరూ విషం తాగిన పరిస్థితిలో కనిపించారు. వెంటనే వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రత్యూష చికిత్స పొందుతూ 24వ తేదీన తుదిశ్వాస విడిచారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి ప్రాణాలతో బయటపడి డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లుగా ల్యాబ్ రిపోర్ట్ లో తేలింది.
ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష చనిపోయారని రిపొర్టు తెలిపింది. ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు, ఆత్మహత్యాయత్నం చేసుకున్నందుకు సిద్ధార్థ్ రెడ్డికి 5 సంవత్సరాల జైలు శిక్షను హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి విధించారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా... జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో దాఖలైన ఈ రెండు క్రిమినల్ అప్పీళ్లపైనే విచారణ పూర్తై, గత నవంబర్‌లో తీర్పు రిజర్వ్ చేయబడింది.
మృతురాలు, నిందితుడు ఇద్దరూ కలిసి పురుగుమందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని సిద్ధార్థరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, ఎల్.నరసింహారెడ్డి కోర్టులో తమ వాదనలు వినిపించారు. కాగా తమ పెళ్లి ప్రతిపాదనను సిద్ధార్థ్ రెడ్డి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో, మనస్తాపం చెంది ఇద్దరూ కలిసి కూల్ డ్రింక్‌లో పురుగులమందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ప్రాథమికంగా పోలీసులు, సిద్ధార్థ్ రెడ్డి తెలిపారు. ఈ కేసు ఆత్మహత్యగా నమోదు అయినప్పటికీ, ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మొదటి నుండి దీనిని హత్య అని వాదిస్తూ వచ్చారు.
Follow Us