/rtv/media/media_files/2025/06/14/ruHnlH5Ec3lY7B2GAOGc.jpg)
Case registered against BRS working president KTR
KTR
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదుతో HYD సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అందుకు సంబంధించిన వీడియోలను ఎమ్మెల్సీ వెంకట్ పోలీసులకు అందచేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యానించిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయన ఫిర్యాదుతో పోలీసులు బీఎన్ఎస్ 353(2), 352 సెక్షన్ల కింద కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read : ఓటీటీలోకి అక్షయ్ కుమార్ హిస్టారికల్ డ్రామా!
Live: బీఆర్కేఆర్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/FZtw8emt04
— BRS Party (@BRSparty) June 11, 2025
ఇది కూడా చదవండి: షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్
ఆయన తన ఫిర్యాదులో కేటీఆర్ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి పరువు, ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన ప్రవర్తన ఉందని అన్నారు. అందువల్లనే కేటీఆర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని బల్మూరి వెంకట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. దీంతో కేటీఆర్‌పై కేసు ఫైల్ చేసిన పోలీసులు .. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!
Also Read : విమాన ప్రమాదం.. 274కు చేరిన మృతుల సంఖ్య
cm-revanth-reddy | ktr-arrest | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates