/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bjp-jpg.webp)
Telangana BJP
తెలంగాణ (Telangana) లో విడతలుగా జిల్లాల పార్టీ అధ్యక్షులను ప్రకటిస్తోంది బీజేపీ (BJP). ఇప్పటికి మూడు విడతల్లో 28 మందిని నియమించింది. తాజాగా ఐదు జిల్లాల పార్టీ అధ్యక్షుల పేర్లను అనౌన్స్ చేసింది అధిష్టానం. ఇందులో నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కె.సత్యయాదవ్, సూర్యపేట శ్రీలతరెడ్డి, సిద్దిపేట బైరి శంకర్ ముదిరాజ్, సిరిసిల్ల ఆర్.గోపి ముదిరాజ్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. తెలంగాణలో మొత్తం 38 జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికి 28 జిల్లాలకు సంబంధించి అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ మరో పది జిల్లాలను పెండింగ్ లో పెట్టింది. మరోవైపు ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లతో పాటూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కూడా నియమించింది.
Also Read : ప్రయాగ్‌రాజ్ వెళ్లే వారికి అలర్ట్..నేడు ఆ రైలు రద్దు..14 గంటల ముందే రైల్వే శాఖ ప్రకటన!
Also Read : యూ బెగ్గర్ అని పిలిచేవాడు...అందుకే చంపేశా!
/rtv/media/media_files/2025/02/18/AAcuobWcoz3hDsudmVLp.jpeg)
మరికొన్ని రోజుల్లో తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించి వరుసపెట్టి బీజేపీ జిల్లా అధ్యక్షులను నియమిస్తోంది. మొదటి విడతలో 19 మంది పేర్లను ప్రకటించింది. తరువాతి విడతలో మరో ఐదుగురు పుర్లను ప్రకటించింది.
Also Read : అల్లుడికి నిప్పంటించిన అత్తామామ! గౌతమ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్
ఇప్పటివరకు ప్రకటించిన జిల్లాల అధ్యక్షులు :
1. ఆదిలాబాద్ - పంతంగి బ్రహ్మానంద.
2. మంచిర్యాల - వెంకటేశ్వర్ గౌడ్
3. కొమరం బీం ఆసిఫాబాద్ - శ్రీశైలం ముదిరాజ్
4. నిజామాబాద్ - దినేశ్ కులాచారి
5. కామారెడ్డి - నీలం చిన్న రాజులు
6. జగిత్యాల రాచకొండ - యాదగిరి బాబు
7. పెద్దపల్లి - కర్రె సంజీవ్ రెడ్డి
8. మెదక్ - వల్దాస్ రాధామల్లేశ్ గౌడ్
9. మేడ్చల్ మల్కాజిగిరి రూరల్ - బుద్ది శ్రీనివాస్
10. నల్గొండ - నాగం వర్షిత్ రెడ్డి
11. మహబూబ్ నగర్ - పి.శ్రీనివాస్ రెడ్డి
12. వనపర్తి - దుప్పల్లి నారాయణ
13. హన్మకొండ - కొలను సంతోశ్ రెడ్డి
14. వరంగల్ -గంట రవి కుమార్
15. జయశంకర్ భూపాలపల్లి - నిశిధర్ రెడ్డి
16. జనగామ - సౌడ రమేశ్
17. ములుగు - సిరికొండ బలరాం
18. మహంకాళి సికింద్రాబాద్ - గుండగోని భరత్ గౌడ్
19. హైదరాబాద్ సెంట్రల్ - లంకాల దీపక్ రెడ్డి
20. యాదాద్రి భువనగిరి - ఊటుకూరు అశోక్ గౌడ్
21. గోల్కొండ-గోషామహాల్- టి. ఉమామహేంద్ర
22. మహబూబాబాద్ - వల్లభు వెంకటేశ్వర్లు
23. సంగారెడ్డి - సి.గోదావరి
Also Read: BIG BREAKING: పెద్దగట్టు జాతరలో తొక్కిసలాట