Hyderabad Crime: యూ బెగ్గర్‌ అని పిలిచేవాడు...అందుకే చంపేశా!

వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సొంత మనవడే ఆయనను హత్య చేశాడు. తాత సొంతమనిషిలా చూడకుండా అవమానించడం వల్లే ఈ హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు.

New Update
Crime

Crime

ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ,వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్థనరావు తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కిలారు కీర్తితేను ఐదు రోజుల పాటు విచారించిన పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. హత్య జరిగిన మరుసటి రోజే నిందితుడ్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌ కు తరలించారు.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

మరింత సమాచారం సేకరించేందుకు పంజాగుట్ట పోలీసులు (Punjagutta Police) కస్టడీకి తీసుకొని నిందితుడినుంచి వాంగ్మూలం సేకరించారు. మొదటి రోజు పోలీసులకు సహకరించకుండా వింతచూపులు చూస్తూ తనలో తాను మాట్లాడినా..ఆ తరువాత హత్యకు దారి తీసిన పరిస్థితులను పోలీసు అధికారుల ఎదుట వివరించినట్లు సమాచారం.

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

బెగ్గర్‌ అంటూ...

యూ బెగ్గర్‌ (You Beggar) అంటూ ప్రతిరోజూ తాత అవమానించేవారు. ఏ రోజు నన్ను సొంత మనిషిగా చూడలేదు. కుటుంబ సభ్యుడిగా కూడా చూడలేదు. అందరి కంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడు. ప్రతిరోజూ నన్ను బెగ్గర్‌ అంటూ పిలిచేవాడు . ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించేవాడు.

తాత అలా తిట్టడం వల్ల ఆఫీస్‌ స్టాఫ్‌ కూడా నన్నుచిన్నచూపు చూసేవారు. ఆస్తి పంపకాలు , పదవుల కేటాయింపుల్లోనూ తక్కువ చేశారు. చివరకు డైరెక్టర్‌ పదవి కూడా నాకు ఇవ్వలేదు. అప్పటి నుంచి నాకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయి.అందుకే చంపేయాలని నిర్ణయించుకున్నా. 

ఇన్‌ స్టా మార్ట్‌ నుంచి కత్తి కొన్నాను. హత్య జరిగిన రోజు కూడా నాకు, తాతకు మధ్య పెద్ద గొడవే జరిగింది.ఆస్తిలో వాటా కావాలని అడిగితే ఇవ్వను అన్నాడు. కోపంతో కత్తితో కసితీరా పొడిచా..హత్య చేసిన తరువాత బీఎస్‌ మక్తా ఎల్లమ్మగూడ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో ఉన్న నా బట్టలను తగలపెట్టాను అంటూ కీర్తి తేజ పోలీసులకు వివరించినట్లు సమాచారం.

Also Read: Anand Mahindra: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

Also Read: Mamata Benarjee: అది నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి దీదీ సవాల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు