/rtv/media/media_files/2025/02/18/VepuEk6kgPkOILbOMDbe.jpg)
Death mystery
Gautham Death Mystery: ఇల్లరికం రానందుకే అత్తింటివారు పెట్రోల్ పోసి నిప్పంటించారని ఇచ్చిన గౌతమ్ మరణవాంగ్మూలం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. భద్రాధ్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రుని పేట గ్రామంలో జరిగిన బల్లెం గౌతమ్ మృతి కేసు(Gautham's death case)లో అతని అత్తమామలు ఎజ్జు అనురాధ, ఎజ్జు వెంకటేశ్వర్లు తమకేం పాపం తెలియదంటున్నారు. గౌతమ్‌ది ముమ్మాటికి ఆత్మహత్యేనని స్పష్టం చేస్తున్నారు. కాగా గౌతమ్ డెత్ కేసులో అంతకుముందు కావ్యతో గౌతమ్ చేసిన వాట్సాప్ ఛాటింగ్ కీలకంగా మారనున్నది. ఛాటింగ్ లో ఈ రోజు నేను పెట్రోల్ పోసుకుని చస్తా అని, చావుకు ముందు మీరే చంపారని మరణ వాగ్మూలం ఇస్తానని గౌతమ్ చేసిన ఛాటింగ్‌ను కావ్య బయటపెట్టింది.
Also Read: అశ్లీల కంటెంట్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
భార్యభర్తల గొడవల నేపథ్యంలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న కావ్య కోసం ఫిబ్రవరి 2న అత్తగారింటికి వెళ్లిన గౌతమ్ మాటమాట పెరగడంతో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని తనకు తానే నిప్పంటించుకున్నాడని వారు తెలిపారు.కాలిన గాయాలతో ఇంటి సమీపంలో ఉన్న నీటి తొట్టెలో దూకాడని భార్య సహా ఆమె తరపు బంధువులు తెలిపారు. గతంలోనూ పలుమార్లు గౌతమ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వారు చెబుతున్నారు. తరచూ వరకట్నం తేవాలంటూ గౌతమ్ సహా అత్తా, మామ వేధించినట్లు కావ్య వాపోయింది. మెట్టినింట్లో తనను బాత్రూం కూడా వెళ్లనివ్వకుండా తాళం వేసి వేధించారని ఆరోపించింది. ప్రేమించి గౌతమ్ ను పెళ్లి చేసుకున్న పాపానికి తనకీ శిక్ష వేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్
గౌతమ్ వాట్సాప్ చాటింగ్ లో..
గౌతమ్ పై తాము పెట్రోల్ పోసి నిప్పంటించలేదని చెబుతున్న అత్తా, మామ గౌతమ్ తీరుపై మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నామని తేల్చి చెప్పారు.గతంలోనూ తాను మరణించి మీపేరు రాస్తానంటూ అత్తింటివారిని గౌతమ్ బెదిరించినట్లు వారు వెల్లడించారు. ఏపనిచేయకుండా తరచూ మద్యం సేవించి గౌతమ్ సైకోలా ప్రవర్తించేవాడని భార్య కావ్య తెలిపింది. కాగా మృతికి మునుపే పతన చావుకు అత్తా, మామ, బామ్మర్థులే కారణమంటూ గౌతమ్ డయ్యింగ్ డిక్లరేషన్ ఇవ్వడం సంచలనంగా మారింది. మృతుడు గౌతమ్ వాంగ్మూలం, తండ్రి ఫిర్యాధు ఆధారంగా తొలుత హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత హత్యకేసుగా మార్చారు. కాగా చేయని పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామని మీడియా ముందు కావ్య కన్నీరు పెట్టుకుంది. గౌతమ్ వాట్సాప్ చాటింగ్ లో కేసుకు సంబంధించిన పలు అంశాలను , ఆధారాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Also Read:Hydra: అక్కడ ప్లాట్లు కొంటే పాట్లు తప్పవు...హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Also Read: కేంద్రం సంచలన ప్రకటన.. బీపీ, షుగర్, క్యాన్సర్ టెస్టులు ఫ్రీ
Follow Us