Kolkata : కోల్‌కతాలో రికార్డు స్థాయిలో వర్షం.. 9 మంది మృతి, 30 విమానాలు రద్దు

పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రిపూట కురిసిన భారీ వర్షాలతో కోల్‌కతా నగరం మొత్తం స్తంభించిపోయింది, నగరంలోని కొన్ని ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వాయుగుండం ప్రభావంతో కోల్‌కతాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

New Update
rains

పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రిపూట కురిసిన భారీ వర్షాలతో కోల్‌కతా నగరం మొత్తం స్తంభించిపోయింది, నగరంలోని కొన్ని ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వాయుగుండం ప్రభావంతో కోల్‌కతాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి.ఈ క్రమంలో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదరుకుంటున్నారు. 

భారీ వర్షాల కారణంగా కోల్‌కతా విమానాశ్రయం పూర్తిగా నీట మునిగింది. దీంతో 30 విమానాలు రద్దు చేశారు. 50కి పైగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. సబర్బన్ రైలు, మెట్రో సేవలు కూడా పలుచోట్ల నిలిచిపోయాయి. నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునగడం వల్ల ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా పార్క్ సర్కస్, గరియాహాట్, బెహలా వంటి ప్రధాన కూడళ్లలో మోకాలు లోతు నీరు చేరింది.  

వాతావరణ శాఖ ప్రకారం కోల్‌కతాలో కేవలం మూడు గంటల్లోనే 185 మి.మీ వర్షపాతం నమోదైంది.  ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన పీడనం కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరంలో తేలికపాటి నుండి మితమైన వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని కోల్‌కతాలోని వాతావరణ శాఖ (IMD) తెలిపింది, ఇది ఒడిశా-ఆంధ్ర తీరం వైపు కదులుతుందని అధికారులు అంటున్నారు. ఇక కరెంట్ షాకుతో  తొమ్మిది మంది మరణించారు. వరదల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. 

సీఎం పర్యటనులు రద్దు

కోల్‌కతా అంతటా అనేక మండపాల వద్ద నీరు నిలిచిపోవడంతో మంగళవారం జరగాల్సిన దుర్గాపూజ ప్రారంభోత్సవాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రద్దు చేసుకున్నారు. ఆమె తన అన్ని సమావేశాలు, ఇతర అధికారిక కార్యక్రమాలను కూడా ఆమె రద్దు చేసుకున్నారు. నగరంలో భారీ వర్షం కారణంగా కలకత్తా విశ్వవిద్యాలయం ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు