Crime News : పెళ్లి చూపులు కాగానే.. ఓయో రూమ్ కు తీసుకెళ్లి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటయ్య తండాలో విషాదం నెలకొంది. పెళ్లి చూపులు ఓ యువతి ప్రాణం తీశాయి. కాబోయే భర్త వేధింపులతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జరిగింది. ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది.

New Update
Young woman commits suicide after being harassed by her fiancé

Young woman commits suicide after being harassed by her fiance

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటయ్య తండాలో విషాదం నెలకొంది. పెళ్లి చూపులు(wedding ceremony) ఓ యువతి ప్రాణం తీశాయి. కాబోయే భర్త వేధింపులతో ఓ యువతి ఆత్మహత్య(Suicide) కు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జరిగింది. వెంకటయ్యతండాకు చెందిన తులికశ్రీకి, సీతారాంపురానికి చెందిన బిచ్చాతో వివాహం నిశ్చయమైంది. ఇటీవల భద్రాచలం వెళ్లొచ్చాక బిచ్చా వేధించడంతో మనస్తాపం చెందింది. దీంతో యువతి 13న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది కుక్కల ప్రేమికుడే.. పక్కా ప్లాన్‌తో దాడి చేశాడా?

Woman Suicide After Over Wedding Ceremoney

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య తండాకు చెందిన తుల్లికశ్రీకి 3 నెలల క్రితం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురంకు చెంది బిచ్చాతో పెళ్లి చూపులయ్యాయి. ఇద్దరు ఇష్టపడడంతో ఎంగేజ్‌మెంట్‌ చేయాలని రెండు కుటుంబాల నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే వారికి నిశ్చితార్థం చేయాలనుకున్నారు. ఇదిలా ఉండగానే ఓ రోజు తుల్లిక శ్రీని గుడికి వెళ్ధామని బిచ్చా రమ్మని అడిగాడు. ఇంటికి కాబోయే అల్లుడే కదా అని కుటుంబ సభ్యులు నమ్మారు. ఆమె కూడా కాబోయే భర్త అన్న నమ్మకంతో అతనితో వెళ్లింది.

Also Read: Crime News: మరో భర్త బలి.. మరిగే నూనె పోసి అతి కిరాతంగా హత్య చేసిన భార్య

తుల్లికను గుడికి తీసుకెళ్తానని చెప్పి భద్రాచలం తీసుకువెళ్లిన బిచ్చా ఆమెను ఒక ఓయో రూము(oyo room) కు తీసుకు వెళ్లాడు. ఇద్దరం ఎలాగు పెళ్లి చేసుకుంటున్నాం కదా నమ్మించి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భద్రాచలం నుంచి తిరిగి వచ్చిన కొద్దిరోజులకే తుల్లిక శ్రీని అనుమానిస్తూ వేధించడం మొదలు పెట్టాడు బిచ్చా. అంతేకాక పెళ్లి చేసుకోవడం కుదరదని తుల్లిక శ్రీకి తేల్చి చెప్పాడు.

Also Read:Venu Swamy: వేణుస్వామిని గుడి నుంచి తరిమేసిన అర్చకులు.. కామాఖ్యా ఆలయంలో షాకింగ్ ఘటన!

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన తులిక శ్రీ ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 
తుల్లికి శ్రీ మంగళవారం తుదిశ్వాస విడిచింది.తుల్లిక శ్రీ మరణించిన తర్వాత ఆమె ఒంటిపై పంటితో కొరికిన గాట్లు, వేళ్లతో రక్కిన గుర్తులు ఉండటంతో అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో బిచ్చాపై కేసు నమోదు చేసిన టేకులపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా. తుల్లికి శ్రీ అంతిమయాత్ర సందర్భంగా తమకు న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.. దీంతో స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబ సభ్యులు నినాదాలు చేశారు.

Also Read: లోక్‌సభలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి.. రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగతులు

Advertisment
తాజా కథనాలు