TG News: ఛీ.. వీడు తండ్రేనా.. కన్న కూతురుపై శాడిజం! కాలితో తన్నుతూ చిత్రహింసలు!
డాడీ కొట్టదు..ప్లీజ్ డాడీ అంటూ కన్న కూతురు కనీళ్లతో వేడుకున్నా ఆ కసాయి తండ్రి గుండె కరగలేదు! కడుపున పెట్టి చూసుకోవాల్సిన కూతురిని కాలితో తన్ని చిత్రహింసలకు గురిచేశారు.
డాడీ కొట్టదు..ప్లీజ్ డాడీ అంటూ కన్న కూతురు కనీళ్లతో వేడుకున్నా ఆ కసాయి తండ్రి గుండె కరగలేదు! కడుపున పెట్టి చూసుకోవాల్సిన కూతురిని కాలితో తన్ని చిత్రహింసలకు గురిచేశారు.
పెళ్లిచేసుకుని ఏడాదిన్నర కాపురం చేసిన ఎన్ఆర్ఐ నవీన్రెడ్డి ముఖం చాటేశాడు. భార్యను వేధింపులకు గురిచేయడంతో పాటు, ఫ్రెండ్లీగా విడిపోదాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాడు. భార్య వీసా క్యాన్సిల్ చేయించి ఆమెను మానసికంగా వేధిస్తున్నాడు.
ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, కొదుమూరు గ్రామంలో ఘోర సంఘటన వెలుగు చూసింది. పాల కోసం ఒక ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో యువకున్ని పట్టుకుని చితకబాదారు.
వేసవిసెలవులు ముగుస్తుండటం, ఆదివారం సెలవు దినం కావడంతో దేవాలయాలకు జనం పోటెత్తారు. తెలంగాణలోని ప్రధాన ఆలయాలైన భద్రాచలం, యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం క్యాడర్కు చెందిన ఇద్దరు, పార్టీ సభ్యులు నలుగురు, మిలీషియా సభ్యులు 11 మంది ఉన్నట్లు వివరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత బలైంది. బత్తుల త్రివేణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్రివేణిని కొంతకాలంగా కానిస్టేబుల్ బత్తుల నాగరాజు మానసికంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్న వంశీ అక్కడే సామ్రాట్ లాడ్జిని ఆనుకొని ఉన్న ఓ గదిలో నివాసముంటున్నాడు. అయితే ఈరోజు ఉదయం వంశీ బ్రష్ చేసుకుంటుండగా లాడ్జీ ట్రాన్స్ఫార్మర్ తీగల ద్వారా విద్యుత్ ఘాతం ఏర్పడి అక్కడిక్కడే మృతి చెందాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు టూరిస్టులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దక్షిణ కొరియాకు చెందిన పర్యాటకులు గాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నమోదవుతున్నకేసుల్లో 41 శాతం ఓరల్, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లున్నాయి. ముందస్తు గుర్తింపుతో ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సర్కారు భావిస్తోంది.