CM Rekha Gupta: సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది కుక్కల ప్రేమికుడే.. పక్కా ప్లాన్‌తో దాడి చేశాడా?

సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది కుక్కల ప్రేమికుడు అని తెలుస్తోంది. నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్ నివాసి అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఢిల్లీలో కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం తీర్పు ఇవ్వడంతో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
Delhi Cm

Delhi Cm

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై బహిరంగంగా ఓ వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సివిల్ లైన్స్‌లో రేఖా గుప్తా నివాసంలో జరిగిన 'జన్ సున్వై' కార్యక్రమంలో ఓ వ్యక్తి ఆమెను కొట్టినట్లు బీజేపీ తెలిపింది. అయితే రేఖా గుప్తాను దాడి చేయడానికి ముందు ఆమెకు కొన్ని పత్రాలను ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె జుట్టును లాగి చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది కుక్కల ప్రేమికుడు అని తెలుస్తోంది. నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్ నివాసి అయినట్లు పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చూడండి: Breaking: ఢిల్లీలో మళ్ళా బాంబు కలకలం.. 50 స్కూళ్ళకు పైగా బెదిరింపులు..

సుప్రీం ఇచ్చిన తీర్పు వల్లనే..

దాడి చేసిన ఆ వ్యక్తి పేరు రాజేష్ ఖిమ్జీ భాయ్ సకారియా అని పేర్కొన్నాడు. అతని వయస్సు 41 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఏ కారణం మీద బహిరంగంగా రేఖా గుప్తాపై దాడి చేశాడనే కోణంలో విచారిస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీలో కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే సీఎంపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఈ వ్యక్తి మానసిక రోగి అని అంటున్నారు. మానసికంగా సరిగ్గా లేకపోవడం, అలాగే కుక్కల మీద ఉన్న అమితమైన ప్రేమ వల్ల ఇలా చేసినట్లు భావిస్తున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు నిందితుడు తల్లిని కూడా విచారించారు.

ఢిల్లీ సీఎంను కలవడానికి వెళ్తున్న విషయం తనకి తెలియదని ఆమె తెలిపారు. అయితే నిందితుడికి ఢిల్లీలో ఏదో ఒక పార్టీతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడిని వీరేంద్ర సచ్‌దేవా ఖండించారు. నిందితుడు సీఎం చేతిని పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడని, దీంతో గొడవ జరిగింది. అప్పుడు ఆమె తల టేబుల్ మూలకు తగిలిందని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. గుప్తా షాక్‌‌కి గురైందని.. కానీ ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని తెలిపారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: ఢిల్లీ CM రేఖాగుప్తాపై దాడి

Advertisment
తాజా కథనాలు