Pension: పెన్షన్ తీసుకుంటున్నారా? వచ్చే నెల నుంచి కొత్త రూల్‌, వీళ్ల పింఛన్ రద్దు?

తెలంగాణలో పెన్షన్ తీసుకునే వారికి ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా..పెన్షన్‌ పంపిణీలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నది.ఫేస్ రికగ్నిషన్ విధానంలో పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

New Update
Aasara pensions

Aasara pensions

Pension : తెలంగాణలో పెన్షన్ తీసుకునే వారికి ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా..పెన్షన్‌ పంపిణీలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నది. అందువల్ల పెన్షన్ తీసుకునే వారు ఈ విషయాన్ని గమనించాలి.చేయూత పథకం కింద ప్రభుత్వం లక్షలాది మందికి పెన్షన్లు అందిస్తూ వస్తోంది. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, వితంతువులు, ఇంకా బీడీ, గీత కార్మికులు వంటి వారు పెన్షన్లు పొందుతున్నారు. ప్రభుత్వం సాధారణంగా అయితే ప్రస్తుతం బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తోంది. చాలా చోట్ల ఇలానే పెన్షన్ డబ్బులు ఇస్తారు. అయితే ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నాయని, అందుకే కొత్త విధానం అమలు చేయాలని గవర్నమెంట్ భావిస్తోంది.అందుకే ఫేస్ రికగ్నిషన్ విధానంలో పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త విధానాన్ని జూన్ నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు కొత్త యాప్‌ను కూడా తయారు చేస్తున్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

Telangana Pensions New Rules

ఇప్పటివరకు ప్రభుత్వం గ్రామాలు, లేదా పట్టణాల్లో వేలిముద్రలు వేయించుకొని పెన్షన్ ఇస్తుంది. మున్సిపాలిటీ ఏరియాలో అయితే నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేస్తారు. ఇకపై ఇలా కాకుండా ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాతనే పెన్షన్ డబ్బులు అందజేస్తారు.ప్రస్తుత విధానంలో వేలి ముద్రలు పడకపోవడం అనే సమస్య అక్కడక్కడ వస్తూ ఉంది. ఇంకా కొన్ని సందర్భాల్లో పెన్షన్ పొందే వారు మరణించినా కూడా వాళ్లకు పెన్షన్ డబ్బులు అకౌంట్లలో జమ అవుతూ వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు కొన్ని చోటుచేసుకున్నాయి. వీటిని అరికట్టేందుకు కొత్త విధానం అమలు కానుంది.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!

కొత్త విధానం అమలులోకి వస్తే.. నకిలీ పెన్షన్లు అన్నీ కూడా రద్దు అవుతాయి. దీని వల్ల అర్హత కలిగిన వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు లభిస్తాయి. అర్హత లేకుండా పెన్షన్ పొందే వారికి రానున్న రోజుల్లో పెన్షన్ కట్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాగా ఇటీవలనే పలు జిల్లాల్లో వందలాది మంది పెన్షన్లను అధికారులు రద్దు చేశారు. అర్హత లేకున్నా కూడా వీళ్లందరూ పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వ వాదన. కొత్త విధానం అమలులోకి వస్తే.. మరింత పకడ్బందీగా రూల్స్ అమలు కానున్నాయి. ఈ క్రమంలో అర్హత లేకుండా పెన్షన్ పొందే వారి పెన్షన్లు కట్ అయిపోయే అవకాశం ఉంటుంది.

Also Read :  సీఎం రేవంత్ కు తప్పిన పెను ప్రమాదం

Also Read :  రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?

 

aasara-pension | aasara-pensions | new-rule | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు