/rtv/media/media_files/2025/08/24/husband-kills-and-burns-wife-2025-08-24-21-10-16.jpg)
Husband kills and burns wife
ఒకవైపు అక్రమ సంబంధాల(Illegal Affair) నేపథ్యంలో భర్తలను భార్యలు చంపుతుంటే, అనుమానాలు, మనస్థర్థలు, వరకట్న గొడవలతో భార్యలను భర్తలు(husband-killed-wife) పొట్టన పెట్టుకుంటున్నారు. భార్యపై అనుమానంతో హైదరాబాద్ బోడుప్పల్‌లో ముక్కలు ముక్కలుగా నరికి మూసినదిలో పడేసిన ఘటనను మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను అడవిలో చంపి ఏకంగా కాల్చివేయడం సంచలనం సృష్టించింది.
Also Read : AP Mega DSC Results: మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి!
Husband Killed Wife
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం అనే యువకుడు 2014 లో మహబూబ్ నగర్ కు చెందిన శ్రావణి అనే అమ్మాయిని ప్రేమించి ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు.ప్రస్తుతం వారికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో శ్రావణి తన తల్లిగారి ఊరైన మహబూబ్ నగర్ లో పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో ఈనెల 21న భర్త శ్రీశైలం మహబూబ్ నగర్ వెళ్లి భార్యను కలిశాడు. బైక్ పై సోమశిల కు వెళ్దామని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. అనంతరం పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ మారేడు మాన్ దీన్నే అడవి ప్రాంతంలోకి తీసువెళ్లాడు. అనంతరం అక్కడ శ్రావణిని హత్యచేశారు. అనంతరం ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడానికి ఆమె శరీరాన్ని కాల్చేశాడు. ఆ తర్వాత ఏం తెలియనట్టే ఇంటికి వెళ్లిపోయాడు.
ఇది కూడా చూడండి: Anil Ambani: అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. రూ.2929 కోట్ల బ్యాంక్ మోసం కేసులో సీబీఐ సోదాలు
అయితే భర్తతో వెళ్లిన తన కూతురు ఇంటికి తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రావణి తండ్రి మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. విచారణలో శ్రావణిని తానే చంపానని చెప్పడంతో పాటు హత్య చేసిన స్థలాన్ని చూపించాడు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.