భయపెడుతున్న అల్పపీడనం... మరికొన్ని రోజులు దంచుడే దంచుడు | Heavy Rains In Hyderabad | RTV
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్ధలు పడ్డారు.
హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ స్తంభించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. నాన్‌స్టాప్‌గా వరుణుడు దంచికొట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మియాపూర్, మదాపూర్ ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్, సరోజ్నీదేవి కంటి ఆస్పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్‌పై వాహనాల రాకపోకలు స్లోగా సాగుతున్నాయి.
గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లో ఎండలు దంచుతుంటే..ఇప్పుడు సడెన్ గా వెదర్ ఛేంజ్ అయింది. ఒక్కసారిగా నగరవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. తొమ్మిది గంటల వరకు కూడా ఎండగానే ఉండగా.. తరువాత నగరం మొత్తం కారు మబ్బులు కమ్మేశాయి. అయితే నగర వ్యాప్తంగా రానున్న రెండు గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు పలు జిల్లాలోను భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు..