/rtv/media/media_files/2025/10/07/raghunandan-rao-files-complaint-against-naveen-yadav-case-registered-2025-10-07-11-13-02.jpg)
Raghunandan Rao files complaint against Naveen Yadav..case registered
Jubilee Hills bypoll: ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ కార్డులు పంచుతున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.కాంగ్రెస్ నేతలు “ఓటర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్” పేరుతో బహిరంగంగా దుకాణం పెట్టుకుని కార్డులను పంచుతున్నారని ఆయన ఆరోపించారు. అసలు “ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎట్లా వచ్చాయి? GHMC కమిషనర్లు, ఎన్నికల అధికారులూ ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కొత్త ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ పోటీకి ఎలా అర్హుడు అవుతాడు అని ప్రశ్నిస్తూ, “ఓటర్ ఐడి కార్డులు ఎవరి అనుమతితో పంచుతున్నారు? GHMC కమిషనరా ఇచ్చారు? లేక ఎన్నికల కమిషనా?” అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలు ఓటర్ కార్డులు పంచుతున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు.
Posted by Raghunandan Rao Madhavaneni on Monday, October 6, 2025
“కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఓటర్ ఐడి కార్డులు ఎలా వెళ్ళాయో ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలి,” అని డిమాండ్ చేశారు.“SIR చేస్తామంటే గగ్గోలు పెట్టే మేధావులు, ఈ కార్డుల చోరీపై కూడా స్పందించాలి. SIR చేస్తామంటే ఓట్ల చోరీ అంటున్నారు, మరి ఇది ఐడీ కార్డుల చోరీ కాదా?” అని ఆయన వ్యాఖ్యానించారు.ఎన్నికల కమిషన్ తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు..
కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించిన ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి నవీన్ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నవీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి చర్యగా ఎన్నికల సంఘం భావించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారుల ఫిర్యాదు మేరకు నవీన్ యాదవ్ మీద బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు అయ్యింది.
కాగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు అవ్వడంతో కాంగ్రెస్‌కు భారీ దెబ్బ తగిలింది. నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకుంటుండగా కేసు నమోదు కావడం రాజకీయా వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. అయితే తాజాగా.. ఎన్నికల సంఘానికి ఎంపీ రఘునందన్ రావు, ఫిర్యాదు చేశారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులు అందజేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన ఎన్నికల సంఘం.. నవీన్ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.
Also Read : ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?