/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
BJP
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..తెలంగాణ బీజేపీ(telangana-bjp) కి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండెళ్లు అవుతున్నప్పటికీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన నేతలకు, మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు పొసగడం లేదు. ఈ ఎన్నికల్లో కనీసం 15 జెడ్పీలు గెలిచి రాజకీయంగా సత్తా చాటుతామని పైకి గంభీరంగా చెబుతున్నప్పటికీ నాయకుల మధ్య లేని సఖ్యతతో మొదటికే మోసం వస్తుందనే బెంగ పార్టీ నాయకత్వాన్ని పట్టి పీడీస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రత్యాన్మాయంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ పూర్తిస్థాయిలో బలపడాలని కలలు కంటున్న నాయకత్వానికి అవేమీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బలపడడానికి స్థానిక ఎన్నికలను వినియోగించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలకు నాయకుల్లో స్పష్టత కొరవడింది. పార్టీలో గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి పాత–కొత్త నాయకులు, వివిధ స్థాయి నాయకుల మధ్య సమన్వయ సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. కొత్తగా పార్టీలో చేరిన నేతలు ఇంకా పార్టీలో ఇమడలేకపోతున్నారు. పైగా ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నేతలు పూర్తిగా సంఘ్ మార్గంలో నడుస్తుండగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఫక్తు రాజకీయ పార్టీ దోరణిలో వ్యవహారిస్తుండంతో ఇరువురి మధ్య సమన్వయం కూడడం లేదన్నది సుస్పష్టం. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలోనూ ముఖ్యనేతల మధ్య సమన్వయలేమి, అంతర్గత సమస్యలు మరోసారి బయటపడటంతో రాష్ర్ట నాయకత్వం తలలు పట్టుకుంటోంది.
Also Read : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నవీన్ యాదవ్ ను అడ్డంగా ఇరికించిన రఘునందన్.. ఏం జరగబోతోంది?
Big Fight Between New Panchayat - During Local Elections
మూడేళ్ల క్రితం ఇతర పార్టీల నుంచి బీజేపీ(bjp) లో చేరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన పలువురు నాయకులకు కూడా ఇంకా పార్టీలో పాత–కొత్తల వివాదం వెంటాడటం వారికి మింగుడు పడటం లేదు. దీన్ని పరిష్కరించాల్సిన నాయకత్వం పట్టించుకోకపోవడంతో ముఖ్యనేతలు సైతం పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా జిల్లా నుంచి మండల, గ్రామస్థాయి వరకు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడం, ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలకు స్నేహపూర్వక సంబంధాలు లేకపోవడం, ఒకరికి ఒకరు సహకరించుకోని పరిస్థితి ఉండటంతో పార్టీ పరిస్థితి రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఎలాగైన 15 జడ్పీలను గెలవాలనుకుంటున్న బీజేపీ బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించనుంది. ఆ సమావేశంలో అందరికీ దిశానిర్ధేశం చేయాలని పార్టీ భావిస్తోంది.
పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గెలిచిన ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సరైన సమన్వయం లేదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పధాదికారుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పలువురు జిల్లా అధ్యక్షులు ఎంపీ, ఎమ్మెల్యేలకు సహకరించడం లేదని వారు ఆరోపించారు. దీంతో ఈ క్రమంలో జిల్లాల అధ్యక్షులపై వచ్చిన ఫిర్యాదులపై మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పార్టీనేత గోలి మధుసూదన్ రెడ్డిలతో ఓ కమిటీని అధ్యక్షుడు రామచందర్‌రావు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే చేసిన విమర్శలు, లేవనెత్తిన అంశాలను సైతం సీరియస్‌గా తీసుకున్న నాయకత్వం.. నేతల మధ్య సమన్వయం, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు, తదితర అంశాలపైనా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య సమన్వయాన్ని పెంపొందించి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా నాయకుల మధ్య సమన్వయం పెంపొందించే దిశగా పార్టీ సమాయత్తమవుతోంది.
Also Read : రాగి సంకటిలో బొద్దింక.. పన్నీరు బిర్యానీలో చికెన్ ముక్క...అసలు ఎలా వండుతున్నార్రా?