Telangana: దారుణం.. తెలంగాణలో 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

తెలంగాణలోని భద్రాచలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరగడం కలకలం రేపుతోంది. ఆ బాలికను ఆటోలు తీసుకెళ్లిన డ్రైవర్లు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళగా పోలీసులు గుర్తించారు.

New Update
Gangrape

Gangrape

తెలంగాణ(Telangana) లోని భద్రాచలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్(gangrape) జరగడం కలకలం రేపుతోంది. ఆ బాలికను ఆటోలు తీసుకెళ్లిన డ్రైవర్లు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళగా పోలీసులు గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆ బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం సాయంత్రం చర్ల మండల కేంద్రానికి వచ్చింది. అక్కడ వాజేడు ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆ సమయంలోనే ఆటోలో ఉన్న ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్‌డ్రింగ్‌లో మత్తమందు కలిపి ఇచ్చారు. అనంతరం గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. 

Also Read: Rahul Gandhi: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ

17 Year Old Girl Gang Rape In Bhadrachalam

చివరికి స్థానికులు బాధితురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఆ బాలిక శరీరంపై పంటిగాట్లు, గాయాలు ఉన్నాయని గుర్తించి  అత్యాచారం కేసు చేశారు. చర్ల, దుమ్ముగూడెం, పాల్పంచ స్టేషన్ల పరిధిలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.     

Also Read:Rasha Thadani: అప్పుడు మిస్.. ఇప్పుడు జాక్ పాట్! ఘట్టమనేని హీరోతో ర‌వీనా టాండ‌న్ కూతురు

ఇదిలాఉండగా మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో మరో దారుణం జరిగింది. ఈస్ట్ బాలాజీ హిల్స్‌లో మహేందర్ అనే వ్యక్తి గర్భంతో ఉన్న తన భార్య స్వాతిని అతికిరాతకంగా చంపేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా రంపంతో కోశాడు. కాళ్లు, చేతులు, తలను వేరు చేసి వాటిని కవర్‌లో వేసి మూసిలో పడేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రూమ్‌లో స్వాతి ఛాతి భాగాన్ని మాత్రమే గుర్తించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే కొద్ది రోజుల క్రితమే మహేందర్, స్వాతి లవ్ మ్యారేజీ చేసుకున్నారు. మహేందర్, స్వాతి స్వస్థలం వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ గ్రామం.

Also Read: నా కూతుర్ని మాయ చేసి ఎత్తుకెళ్లిపోయాడు.. రంపంతో కోసేశాడు :  స్వాతి తల్లి

మేడిపల్లి పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నారు. డీఆర్‌ఎఫ్ టీమ్, స్థానికుల సాయంతో మూసీలో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు మహేందర్‌ రెడ్డి ఘటనాస్థలానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. రాత్రి సమయంలో మహేందర్ స్వాతి శరీర భాగాలను తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ పుటేజ్‌లో కనిపించాయి. ఈ ఘటనపై స్వాతి తల్లి కూడా మీడియాతో మాట్లాడారు. డిగ్రీ చదువుతున్న తన కూతురికి మహేందర్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని వాపోయింది. తాము అతడితో పెళ్లి వద్దని వాదించామని కానీ తన కూతురు మాట వినకుండా అతడిని పెళ్లి చేసుకుందని ఆవేదన చెందింది. కొన్ని రోజులుగా తన కూతురుని చిత్ర హింసలు పెడుతున్నారని.. స్వాతి భర్త మహేందర్, అత్తమామలు కలిసి ఆమెను చంపేశారంటూ కన్నీరు పెట్టుకుంది. 

Also Read: రూ. 500 పెట్టి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని.. సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు!

Advertisment
తాజా కథనాలు