/rtv/media/media_files/2025/08/24/bapatla-2025-08-24-11-34-56.jpg)
Medchal Murder: మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో దారుణం జరిగింది. ఈస్ట్ బాలాజీ హిల్స్‌లో భార్యను అతికిరాతకంగా చంపేశాడో భర్త(Husband Killed Wife Incident). భార్య స్వాతిని ముక్కలు ముక్కలుగా నరికేశాడో భర్త మహేందర్. రంపంతో స్వాతి శరీరాన్ని ముక్కలు చేసి కవర్‌లో వేసిన మహేందర్.. కాళ్లు, చేతులు, తలను వేరు చేసి మూసిలో పడేశాడు. రూమ్‌లో కేవలం స్వాతి ఛాతి భాగం మాత్రమే గుర్తించారు పోలీసులు. కొద్ది రోజుల క్రితమే మహేందర్, స్వాతి లవ్ మ్యారేజీ చేసుకున్నారు. మహేందర్, స్వాతి స్వస్థలం వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ గ్రామం. ప్రస్తుతం స్వాతి గర్భణీ కూడా.
Also Read: వావ్.. వాటే కాన్సెప్ట్..! రోబో కుక్కలతో ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..?
అయితే ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు మేడిపల్లి పోలీసులు. DRF టీమ్, స్థానికుల సాయంతో మూసీలో గాలింపులు చేపట్టారు. మహేందర్ రెడ్డిని స్పాట్‌కి తీసుకెళ్లి విచారిస్తున్నారు పోలీసులు. రాత్రి 2 బ్యాగుల్లో స్వాతి శరీర భాగాల్ని తీసుకెళ్లాడు మహేందర్. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు కనిపించాయి. ఇంట్లో వాళ్లను కాదని మహేందర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది స్వాతి.
Also Read:2 నిమిషాలు.. 15 బిలియన్ వ్యూస్.. యూట్యూబ్‌ను షేక్ చేసిన టాప్ వీడియోలు ఇవే..!
మాయ చేసి మహేందర్ రెడ్డి ఎత్తుకెళ్లిపోయాడు
ఈ ఘటనపై స్వాతి తల్లి మీడియాతో మాట్లాడారు. నా కూతుర్ని మాయ చేసి మహేందర్ రెడ్డి ఎత్తుకెళ్లిపోయాడు. డిగ్రీ చదువుతున్న తన కూతురికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడని, అతని మాయలో పడి తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు.. ప్రేమ వివాహం వద్దని చెప్పి తాము వారించామని, అయినప్పటికీ తమ మాట వినకుండా మహేందర్‌ను పెళ్లి చేసుకుందన్నారు. కొన్ని రోజులుగా తన కూతురిని చిత్రహింసలు పెడుతున్నారని చెబుతోంది.. స్వాతి అత్తమామలు, మహేందర్ కలిసి తన కూతురిని చంపారని ఆమె వాపోయింది.