/rtv/media/media_files/2025/04/17/yCYsWtCHJJyCvsyL7HVG.jpg)
Narendra Modi
ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం పై పలు ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రధాని మోదీ ‘ఆపరేషన్ సిందూర్ లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. సిందూర్ శపథం నెరవేర్చినందుకు భారత సైన్యం ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఈ వర్షాకాల సమావేశాలు భారత్ విజయ్ ఉత్సవానికి నిదర్శనమన్నారు.. దేశమంతా విజయోత్సవాలు జరుపుకుంటుంటే అనవసరంగా దీన్ని రాజకీయం చేయొద్దు అని సూచించారు. టెర్రరిస్టుల హెడ్ క్వార్టర్స్‌ను ధ్వంసం చేసినందుకు విజయోత్సవాలు.. సిందూర్ శపథాన్ని నెరవేర్చినందుకు ఈ విజయోత్సవాలు జరుపుకొంటున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: 'మోదీ దమ్ముంటే సిందూర్ సీక్రెట్ చెప్పు'.. రాహుల్ గాంధీ సవాల్
We Attacked The Heart Of Pakistan - PM Modi
సైన్యం పోరాటాన్ని అందరూ అభినందించాలి.. ప్రశంసించాలి. సైన్యాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దు అన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను 22 నిమిషాల్లోనే ముగించామని చెప్పడానికి గర్వపడుతున్నాం అని మోదీ అన్నారు. వందల సంఖ్యలో ఉగ్రవాదుల్ని హతమార్చాం. ఉగ్ర స్థావరాల్ని నేలమట్టం చేశామని ప్రధాని చెప్పుకున్నారు. ఈ దాడితో పాక్ అణు హెచ్చరిక అబద్ధమని నిరూపించామన్నారు. మన సాంకేతిక ప్రతిభతో పాక్ గుండెలపై దాడి చేశాం. పాక్ ఎయిర్‌బేస్‌లకు తీవ్ర నష్టం కలిగించామని మోడీ వెల్లడించారు. పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయని ప్రధాని మోడీ లోక్‌సభలో ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశాన్ని ఆపలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ వేదికగా ప్రకటించారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రకటనలు ఇచ్చిన దేశాలు కేవలం మూడు మాత్రమేనని తెలిపారు. యుద్ధ సమయంలో తనకు అండగా నిలిచిన భారత ప్రజలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ ముందు పాకిస్థాన్ తేలిపోయిందన్నారు. భారత్ ప్రతికార దాడులు చూసి పాక్ బిత్తరపోయిందన్నారు.మన సైన్యం సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదులతో పాకిస్థాన్ బంధం బహిరంగ రహస్యమేనని మోదీ అన్నారు. ఉగ్రవాదానికి ఊతమిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని పాకిస్థాన్‌కు అర్థమయ్యేలా చెప్పామని ప్రధాని తెలిపారు. పాకిస్థాన్ మళ్లీ దాడులకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని మోదీహెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదని, ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న టెర్రరిస్టులు చేసిన దాడి క్రూరత్వానికి ప్రతీక అని ప్రధాని అన్నారు.
56 ఇంచుల చెస్ట్ ప్రధాని ఎక్కడ అంటూ కాంగ్రెస్ నాపై విమర్శలు చేసిందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ హెడ్‌లైన్స లో ఉండచ్చు కానీ, ప్రజల హృదయాల్లో నిలవలేదన్నారు. ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నేత తమకు చెప్పలేదని మోదీ స్పష్టం చేశాం. మే 9న జేడీ వాన్స్ పెద్దఎత్తున దాడి జరపబోతోందని నాకు చెప్పారు. దీనికి నేను పాక్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జేడీ వాన్స్‌కు తెలిపాను. బుల్లెట్‌కు సమాధానం బుల్లెట్‌తోనే చెబుతామని చెప్పాను. పాకిస్థాన్‌కు ఎవరూ సాయం చేసినా ఊరుకునేది లేదని చెప్పారు. పాకిస్థాన్ ఎలాంటి కుయుక్తులు మళ్లీ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని మోదీ లోక్‌సభలో స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: టెర్రరిస్టుల దగ్గర పాకిస్తాన్ చాకెట్లు.. పార్లమెంట్‌లో అమిత్ షా కీలక విషయాలు
operation Sindoor | parlament | Rahul Gandhi | national news in Telugu | latest-news-in-telugu | telugu-news