/rtv/media/media_files/2025/07/29/indian-sperm-tech-office-2025-07-29-18-30-55.jpg)
Indian Sperm Tech office
Indian Sperm Tech office : సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆగడాలు ఒక్కొటొక్కటిగా భయటకు వస్తుండంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లపై దాడులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సికింద్రాబాద్‌లో ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. క్లూస్ టీమ్ ను వెంటబెట్టుకుని పోయిన గోపాలపురం పోలీసులు అక్కడ ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా పలువురి నుంచి సేకరించిన వీర్యకణాలను అక్కడ నిలువ చేస్తున్నట్లు గుర్తించారు. దానికి సంబంధించిన మూడు డబ్బాలు, ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పనులు నిర్వహిస్తున్న ఓనర్ పంకజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: మందు బాబులకు అదిరిపోయే న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Hacking Scenes In Indian Sperm Tech Office
కాగా ఈ సందర్భంగా పలు షాకింగ్ విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. స్పెర్మ్ టెక్ ఆఫీస్ కేంద్రంగా సృష్టి లాంటి పలు టెస్ట్ ట్యూబ్ సెంటర్లకు వీర్యకణాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాక పలువురు యువతీ, యువకులు, యాచకులకు డబ్బులు ఆశచూపి వారినుంచి వీర్యకణాలు, అండాలు సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీర్యకణాలు ఇచ్చే యువకులకు రూ.5 నుంచి రూ.10 వేలు ఇస్తున్నారని, ఇక యువతులనుంచి అండాల సేకరణ కోసం రూ.30 నుంచి రూ.50 వేలు ఇస్తున్నట్లు తేలింది. ఇండియన్ స్పెర్మ్ టెక్ ఆఫీసు నిర్వహిస్తున్న పంకజ్ నుంచి మరిన్ని విషయాలను రాబట్టేందుకు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మానవ హక్కుల కమిషన్ సీరియస్..
ఇక సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ రాష్ర్టంలో సృష్టించిన అరాచకాలపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్‌ఆర్సీ ఆగస్టు 28లోపు పూర్తి నివేదిక అందివ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అమ్మతనాన్ని అంగడి సరకుగా మారుస్తున్నారని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ కేసులో డాక్టర్ నమ్రత సహా ఇప్పటివరకూ 8 మందిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా కేసులో కీలకంగా భావిస్తున్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం విధితమే. కాగా, నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం..
మరోవైపు ఇటు తెలంగాణ, అటు ఏపీలోను సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అనేక అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. దీనిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశించింది. నిజానికి 2016లోనే TGMC డాక్టర్ నమ్రత మెడికల్ లైసెన్స్ ను ఐదేళ్లపాటు రద్దుచేసింది. అయితే 2021లో తిరిగి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండటంతో అంగీకరించలేదు. దీంతో వేరే డాక్టర్ల లైసెన్సుల ద్వారా డాక్టర్ నమ్రత ప్రాక్టీసు కొనసాగిస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో అటు మానవ హక్కుల కమిషన్, ఇటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్ అయ్యాయి. విచారణ అనంతరం చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నాయి.
ఇది కూడా చూడండి: ఎంతకు తెగించార్రా...ప్యాకెట్లు..చాక్లెట్లు...కాదు ఏకంగా ఇంజెక్షన్లు
srushti test tube center secunderabad | Srushti IVF Center | latest telangana news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu crime news