ఇటీవల BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జూబ్లీహిల్స్ స్థానంపై ఫోకస్ పెంచాయి. త్వరలో రానున్న ఉప ఎన్నికకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికలో స్థానికులకే టికెట్ ఇవ్వనున్నట్లు ఆయన తేల్చి చెప్పారు. బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వమని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకుని త్వరలో పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. కంటోన్మెంట్‌లో BRS ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో వచ్చిన ఉప ఎన్నికలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీగణేష్ గెలిచారు. ఉపఎన్నికతో కాంగ్రెస్ కి సిటీలో ఓ సీటు దక్కినట్లైంది. అయితే ఈ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీకి ఫెవర్‌గా ఉండబోతుందా? లేదా? అనేది చూడాలి. ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో దాదాపు 10 మంది అధిష్టాన పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో MLA టికెట్ వాళ్లకే.. తేల్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ స్థానికులకే టికెట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వమని అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు.