Nano Banana: వైరల్ అవుతున్న నానో బనానా ట్రెండ్..ఫోటోలను త్రీడీ బొమ్మలుగా మారుస్తున్న ఏఐ

టెక్నాలజీలో రోజుకో కొత్త వింత పుట్టుకొస్తోంది. తరువాత ట్రెండ్ అయి జనాలను తన చుట్టూ తిప్పుకుంటోంది. తాజాగా గూగుల్ జెయినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్ ద్వారా "నానో బనానా" 3D ఫిగరిన్.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది.

New Update
nano

Nano banana Trend

గూగుల్ జెమిని(google-gemini-ai) కొన్ని రోజుల క్రితం నానో బనానా(Nano Banana) పేరుతో ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ ను విడుదల చేసింది. ఇది కాస్తా సూపర్ హిట్ అయింది. జనాలు పిచ్చిగా దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఈ జెమిని యాప్ 10 మిలియన్ డౌన్ లోడ్స్ ను దాటింది. ఇది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ త్రీడీ ఫిగరిన్ఫోటోలు ఇన్ స్టా గ్రామ్, టెక్ టాక్, ఎక్స్, ఎఫ్బీలలోవెల్లువెత్తుతున్నాయి. దీంటో ఎవరైనా తమ ఫోటోను లేదా మరే ఇతర ఇమేజ్ ను అయినా హైపర్-రియలిస్టిక్ 3D కలెక్టబుల్ఫిగరిన్‌ గా మార్చుకోవచ్చును.

అసలేంటీ నానో బనానా..

ఇదొక ఏఐ ఇమేజ్ టూల్. గూగుల్ దీన్ని లాంచ్ చేసింది. నిజానికి నానో బానానా అనే పేరును ఇంటర్నెట్ లోనే సృష్టించబడి..ట్రెండ్ అయింది. ఈ టూల్ లో టెక్స్ట్ ప్రాంప్ట్ లేదా ఫోటోలుఇస్తే..వాటితోరియలిస్టిక్ గా ఉండే త్రీడీ ఫిగరిన్లను తయారు చేసి ఇస్తుంది. ఇవి చిన్న బొమ్మల్లా కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే పిల్లలు ఆడుకునే కలెక్టబుల్టాయ్స్ లా ఉంటాయి. ఎలాంటి ఫోటోను అయినా ఈ ఏఐ టూల్ తో త్రీడీ ఫిగరిన్ గా మార్చవచ్చును. ఇప్పటికి ఈ ఏఐ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫోటోలను సృష్టించింది. నిమిషాల్లోనే త్రీడీ బొమ్మలను తయారు చేసి ఇస్తోంది. మిగతా ఏఐయాప్స్కంటే ఈ గూగుల్ జెమినీ 2.5 వెర్షన్ వేగంగా ఉందని చెబుతున్నారు.

Also Read :  AI ఫీచర్లు, కర్వ్డ్ డిస్‌ప్లేతో కొత్త ఫోన్ అదరింది మచ్చా.. ధర వెరీ చీప్..!

బనానో ఏఐలో 5 ప్రాంప్ట్స్..

ప్రస్తుతం నానో బననా 5 ప్రాంప్ట్‌లలో అందుబాటులో ఉంది. అన్నింటినీ పూర్తిగా ఉచితంగా డౌన్ లోడ్ చసుకోవచ్చును.

ప్రాంప్ట్ 1

ఇందులో తమ ఫోటోను అప్‌లోడ్ చేసి కలెక్టివ్టాయ్ ను రూపొందించమని జెమినినిఅడగవచ్చు. ఇది ప్యాకేజింగ్, గ్రాఫిక్స్, స్టోర్-షెల్ఫ్ లుక్‌తో పూర్తి చేస్తుంది. దీన్నే చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాంప్ట్‌లలో ఇది ఒకటి. ఇందులో మనల్ని మనం యాక్షన్ ఫిగర్‌గామార్చుకోవచ్చును.

ప్రాంప్ట్ 2

ప్రస్తుతం ఉన్నవారు కూడా వేరే దశాబ్దంలో ఉన్నట్లు కూడా బొమ్మలను సృష్టించుకోవచ్చు. మన ఫోటోను 1920ల ఫ్లాపర్, 1970ల డిస్కో డాన్సర్ 1990ల సూపర్ హీరోల్లా ఎలా అయినా చేయమని అడొగొచ్చు. మనం ఎంచుకున్న దశాబ్దానికి సరిపోయే విధంగా బట్టలు, హెయిర్‌స్టైల్స్వంటివాటినిఏఐ మారుస్తుంది.

ప్రాంప్ట్ 3

చాలా మంది తమను తాము పాపులర్ టీవీ షోల్లోల లేదా మరే ఇతర క్యారెకర్టర్ గానూ చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ కలను బననాఏఐ నిజం చేస్తుంది. మనం కోరుకున్నట్లు ఏఐ మనల్ని మార్చి ఇస్తుంది.

Also Read :  ఐఫోన్ ఎయిర్ డిజైనర్ మనోడే.. అబిదుర్ చౌదరి దెబ్బకు యాపిల్‌ కంపెనీ షేక్!

ప్రాంప్ట్ 4

జెమిని ఏఐతో మనల్ని ప్రముఖుల పక్కన ఉన్నట్లు కూడా రూపొందించుకోవచ్చును. ఉదాహరణకు మోనాలిసా పక్కన నిలబడి ఉండటం, వాన్ గోహ్స్టార్రి నైట్‌లో కనిపించడం లేదా డాలీ ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీలో కలిసిపోవడం లాంటివి కూడా చేసుకోవచ్చును. మనకు నచ్చిన ప్రముఖుల పక్కన మనల్ని మనం చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది.

ప్రాంప్ట్ 5

బననాఏఐ సాయంతో.. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా సృష్టించుకోవచ్చును. ఐఫెల్ టవర్ నుంచి తాజ్ మహల్, హాలీవుడ్ సైన్ వరకు మనకు నచ్చిన ప్రసిద్ధ ప్రదేశంలో మనం ఉన్నట్లు చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏఐ దీనికి లైటింగ్ ఇతర షేడ్స్ కూడా అందిస్తుంది.

Also Read: India-US Trade war: భారత్, అమెరికాలు త్వరలోనే కలిసిపోతాయి..అమెరికా రాయబారి సెర్గియో గోర్

Advertisment
తాజా కథనాలు